English News Headline
Inter-District Bike Theft Gang Busted in Shamirpet, Nine Stolen Two-Wheelers Recovered


పూర్తి తెలుగు వార్త
హైదరాబాద్: మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని శామీర్‌పేట పోలీసులు అంతర్‌జిల్లా ద్విచక్ర వాహనాల దొంగల ముఠాను అరెస్ట్ చేసి, వారి నుంచి తొమ్మిది చోరీకి గురైన ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలను జవహర్‌నగర్ డివిజన్ ఏసీపీ ఎస్. చక్రపాణి వెల్లడించారు.
ఏసీపీ తెలిపిన వివరాల ప్రకారం, జూలై 17 అర్ధరాత్రి తూంకుంటలోని దొంగల మైసమ్మ చౌరస్తా వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు. దర్యాప్తులో ప్రధాన నిందితుడు నల్లగండ్ల నవీన్ రాజ్ అలియాస్ బన్నీతో పాటు ముగ్గురు బాల నేరస్తులు ముఠాగా ఏర్పడి శామీర్‌పేట, కీసర, కుషాయిగూడ, మునుగూరు (ఖమ్మం), పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడినట్లు గుర్తించారు.
నిందితుల నుంచి పల్సర్, బుల్లెట్, డ్యూక్, అవెనిస్, యాక్టివా తదితర మొత్తం తొమ్మిది ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు.
ఈ కేసును ఛేదించిన శామీర్‌పేట పోలీస్ స్టేషన్ సిబ్బందిని ఏసీపీ చక్రపాణి అభినందించారు.
Full English News Article
Hyderabad: Shamirpet Police under the Malkajgiri Commissionerate arrested an inter-district motorcycle theft gang and recovered nine stolen two-wheelers from their possession. Jawaharnagar Division ACP S. Chakrapani disclosed the case details.
According to the ACP, the accused were intercepted during a late-night vehicle inspection near Dongala Maisamma Junction in Thumkunta on July 17. During questioning, police found that the gang, led by Nallagandla Naveen Raj alias Bunny along with three juvenile offenders, had allegedly been involved in multiple motorcycle thefts across Shamirpet, Keesara, Kushaiguda, Munugodu (Khammam) and Pet Basheerabad police station limits.
Police recovered nine stolen two-wheelers, including Pulsar, Bullet, Duke, Avenis and Activa models. The accused were produced before the court and remanded to judicial custody.
ACP Chakrapani appreciated the Shamirpet Police personnel for successfully detecting the case.