English News Headline
Annadanam Organised at Sri Renuka Yellamma Temple in Shamirpet

Full Telugu News Article
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, శామీర్‌పేట: శామీర్‌పేట మండల కేంద్రంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో భక్తులకు ఘనంగా అన్న ప్రసాద వితరణ నిర్వహించారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు అన్నదానం చేపట్టారు.
శామీర్‌పేటకు చెందిన నామాల రమేష్–అరుణ దంపతులు తమ కుటుంబ సభ్యులతో కలిసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే శ్రావణ్–లావణ్య దంపతులు ఆలయానికి 25 కిలోల బియ్యాన్ని విరాళంగా అందజేశారు.
ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన భక్తులతో పాటు మాజీ ప్రజాప్రతినిధులు, రాజీవ్ రహదారిపై ప్రయాణిస్తున్న భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో స్థానిక భక్తులు, ఆలయ నిర్వాహకులు పాల్గొని సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Full English News Article
Shamirpet, Medchal Malkajgiri: An Annadanam (free meal distribution) programme was organised at the Sri Renuka Yellamma Temple in Shamirpet after special prayers were offered to the presiding deity.
The food distribution was sponsored by Namala Ramesh and Aruna, along with their family members. On the occasion, Shravan and Lavanya donated 25 kilograms of rice to the temple.
Devotees visiting the temple, former public representatives, and pilgrims travelling along the Rajiv Highway participated in the programme and received the prasadam. Local devotees and temple representatives appreciated the charitable initiative.
