
Image: Screenshot from ‘ : https://www.youtube.com/ ” (used under fair use for reporting)
అందుకే మిమ్మల్ని తైతక్కల రోజా అనాల్సి వస్తోంది: పంచుమర్తి అనురాధ — వైసీపీ కాలంలో నాసిరకం మద్యంతో ప్రజల రక్తాన్ని పీల్చేశారు అని మండిపాటు
“WYSIWYG politics won’t work — YSRCP sucked people’s blood with spurious liquor,” fires Panchumarthi Anuradha at Roja
మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు ఆర్కే రోజా వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ తీవ్రంగా స్పందించారు. అమరావతిలో ఆమె మాట్లాడుతూ, “రోజా.. మీరు మాట మీద నిలకడగా ఉండరు కాబట్టి మిమ్మల్ని తైతక్కల రోజా అనాల్సి వస్తోంది. పీనుగ పోయినా ఆ పాపం ఇంకా కనిపిస్తూనే ఉంది” అని వ్యాఖ్యానించారు. వైసీపీ హయాంలో నాసిరకం మద్యంతో ప్రజల రక్తాన్ని స్ట్రా వేసి పీల్చేశారని, అది ప్రజలు మరిచిపోలేరని ఆమె అన్నారు.
Panchumarthi Anuradha, Chief Whip of the Andhra Pradesh Legislative Council, lashed out at former minister and YSRCP leader RK Roja for her remarks. Speaking in Amaravati, Anuradha accused Roja and the YSRCP of exploiting people with substandard liquor during their tenure, stating, “People’s blood was sucked dry with spurious liquor — don’t forget that.”
పంచుమర్తి అనురాధ మాట్లాడుతూ, “మీ పాపాల్ని తుడిచే ప్రయత్నంలోనే మొలకల చెరువులో కల్తీ సారా వ్యవహారం బయటపడింది. ఆ పాపం జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పుట్టింది. కూటమి ప్రభుత్వం వచ్చాక దాన్ని వెలుగులోకి తెచ్చింది,” అని చెప్పారు. మేము ప్రక్షాళన చేస్తుంటే మీరు నిందలు మోపడం తప్పని తేల్చారు.
She further said that the spurious liquor scandal at Mulakalacheruvu was a remnant of YSRCP’s governance and was exposed only after the coalition government came to power. “When we’re cleaning up your sins, you’re trying to throw the blame at us,” she added.
“గొడ్డలి పోటు నుంచి గులకరాయి వరకు మీ డ్రామాలు చూశాం. తప్పు మీరు చేయడం, నెపాన్ని మా మీద నెట్టడం మీ అలవాటే. వివేక హత్య కేసులో సీబీఐ ఎంక్వైరీ వద్దని జగన్ ఎందుకు డిమాండ్ చేశారో ముందుగా చెప్పండి. ఆ తర్వాత కల్తీ లిక్కర్ వ్యవహారంపై సీబీఐ విచారణ డిమాండ్ చేస్తే బాగుంటుంది,” అని పంచుమర్తి అనురాధ విరుచుకుపడ్డారు.
Anuradha concluded by questioning why former CM Jagan Mohan Reddy opposed a CBI probe in the Viveka murder case. “First, explain why you resisted the CBI inquiry then. Only after that can you demand a probe into the fake liquor issue,” she said.