
పంజాబ్‌లో భారీ వర్షాలు, వరదల బీభత్సం – 37 మంది మృతి
Flood fury in Punjab claims 37 lives, crops damaged across 23 districts
పంజాబ్‌లో కురిసిన భారీ వర్షాలతో నదులు, కాలువలు పొంగిపొర్లి వరద బీభత్సం సృష్టించాయి. వరదలో కొట్టుకుపోయి ఇప్పటివరకు 37 మంది మృతి చెందగా, వందల సంఖ్యలో పశువులు కూడా చనిపోయినట్లు సమాచారం. అనేక గ్రామాలు నీటమునిగిపోయి, రహదారులు జలమయమయ్యాయి.
Heavy rains in Punjab triggered severe floods as rivers and canals overflowed, claiming 37 lives so far. Hundreds of cattle were also washed away. Several villages have been submerged, and major roads have turned into flood zones.
పంజాబ్‌లో 37 ఏళ్ల తర్వాత ఇంతటి వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని 23 జిల్లాల్లో 1.75 లక్షల హెక్టార్ల పంటలు నష్టపోయాయి. ప్రభుత్వం రూ.71 కోట్ల తక్షణ సాయం ప్రకటించింది. ఈ నెల 7 వరకు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. కేంద్రం నుంచి తక్షణ సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.
This is the heaviest rainfall in Punjab in the past 37 years. Crops spread across 1.75 lakh hectares in 23 districts have been damaged. The state government announced an immediate relief of ₹71 crore and declared holidays for educational institutions till September 7. It also appealed to the Centre for urgent assistance.