
వైఎస్ఆర్ 16వ వర్ధంతి వేడుకలు తుగ్గలిలో నిర్వహించబడుతున్నాయి. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు, కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని వైఎస్ఆర్సీపీ నేతలు పిలుపునిచ్చారు.
YSR’s 16th death anniversary will be observed in Tuggali, with YSRCP leaders calling for mass participation to make the event successful.
తుగ్గలి:
దివంగత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతిని తుగ్గలిలో ఘనంగా నిర్వహించనున్నట్లు వైఎస్ఆర్సీపీ నేతలు ప్రకటించారు. జిల్లా అధ్యక్షులు జిట్టా నాగేష్ యాదవ్, మండల అధ్యక్షుడు అట్లా గోపాల్ రెడ్డి వివరాలు తెలియజేశారు.
మంగళవారం ఉదయం 9:30 గంటలకు మండల కేంద్రమైన తుగ్గలిలో వర్ధంతి కార్యక్రమం జరుగనుంది. ఈ వేడుకలకు పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి హాజరుకానున్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించనున్నారు.
నేతలు మాట్లాడుతూ – మండల పరిధిలోని వైఎస్ఆర్సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అలాగే వైఎస్ఆర్ అభిమానులు పెద్ద ఎత్తున హాజరై వర్ధంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
YSR’s 16th death anniversary will be observed in Tuggali, with YSRCP leaders urging cadres, supporters, and the public to participate in large numbers and make the event successful.
Tuggali:
The 16th death anniversary of former Andhra Pradesh Chief Minister Dr. YS Rajasekhara Reddy will be observed in Tuggali, YSRCP leaders announced. District president Jitta Nagesh Yadav and mandal president Atla Gopal Reddy shared the details.
The program will be held on Tuesday at 9:30 a.m. in Tuggali mandal headquarters. Former Puttaparthi MLA Kangati Sridevi will attend the event. Leaders said floral tributes will be offered to YSR’s statue as part of the anniversary.
Calling on the public, leaders appealed to YSRCP representatives, local leaders, party workers, and YSR admirers to participate in large numbers and make the anniversary event a grand success.