
విజయవాడలో భారీ వర్షాల ప్రభావంతో ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్ను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. Heavy rains in Vijayawada have led to the temporary closure of Indrakeeladri Ghat Road as a precautionary measure.
విజయవాడ, జూలై 25: ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని తాత్కాలికంగా మూసివేయబడింది. భక్తుల వాహనాలను కనకదుర్గ నగర్ వైపు మళ్లిస్తున్నారు. భక్తులు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.