The execution of Indian nurse Nimisha Priya has taken a sharp turn again, as the victim’s family firmly refused any blood money settlement, pushing her closer to the death penalty.

నిమిష ప్రియ ఉరిశిక్షపై మరో మలుపు – మృతుడి కుటుంబం స్పష్టం చేస్తూ ‘క్షమాధనం లేదు’ అంటోంది
The execution of Indian nurse Nimisha Priya has taken a sharp turn again, as the victim’s family firmly refused any blood money settlement, pushing her closer to the death penalty.

భారతీయ నర్సు నిమిష ప్రియకు యెమెన్ కోర్టు విధించిన ఉరిశిక్ష తాత్కాలికంగా వాయిదా పడినప్పటికీ… మృతుడు తలాల్ కుటుంబం క్షమాధనాన్ని అంగీకరించకపోవడంతో ఆమె మరణశిక్ష మళ్లీ అమలవ్వనుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జులై 16న శిక్ష అమలు కావాల్సి ఉండగా, విదేశాంగ శాఖ మరియు మతగురువుల చొరవతో అది తాత్కాలికంగా ఆపివేశారు. కానీ తాజా పరిణామాల ప్రకారం నిమిష ప్రియకు విముక్తి దక్కే అవకాశాలు మరింత కష్టంగా మారాయి.

2018లో ట్రయల్ కోర్టు నిమిష ప్రియకు ఉరిశిక్ష విధించగా, 2024లో యెమెన్ సుప్రీంకోర్టు దాన్ని సమర్థించింది. బాధితుడు తలాల్ కుటుంబం క్షమాధనంగా ఒక మిలియన్ డాలర్లను (దాదాపు రూ.8.6 కోట్లు) తీసుకునేందుకు నిరాకరించింది. నిమిష ప్రియ తల్లి గతేడాది యెమెన్ వెళ్లి కుమార్తె ప్రాణాలు రక్షించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. కానీ తాజాగా మృతుడు సోదరుడు అబ్దుల్ ఫత్తా మెహది తన ఫేస్‌బుక్ పోస్టులో “బ్లడ్‌మనీ అంగీకరించం… శిక్ష తప్పదు… న్యాయం కావాలి” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఇప్పటికీ మృతుడు కుటుంబంతో సంప్రదింపులు కొనసాగుతుండగా, నిమిష లాయర్ ప్రకారం ‘క్షమాధనానికి ఇంకా అవకాశాలు ఉన్నాయని’ చెబుతున్నారు. అయినా కూడా, తలాల్ కుటుంబం దృఢంగా శిక్ష అమలే జరగాలని కోరుతుండటంతో, నిమిష ప్రియను ఉరి తీయకుండా నిలిపే మార్గం ఒకటే – బాధిత కుటుంబాన్ని కరిగించడమే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *