In Mangalagiri constituency, IT and Education Minister Nara Lokesh directed officials to finalize land titles for 2,000 families in August and expedite multiple development works, including housing, markets, smart roads, and adventure park plans.

మంగళగిరిలో మరో 2వేల ఇళ్లపట్టాలు – ఎకో పార్కు, మోడల్ మార్కెట్లు, భారీ అభివృద్ధి పనులకు మంత్రి లోకేష్ సమీక్ష

In Mangalagiri constituency, IT and Education Minister Nara Lokesh directed officials to finalize land titles for 2,000 families in August and expedite multiple development works, including housing, markets, smart roads, and adventure park plans.

మంగళగిరి నియోజకవర్గంలో మరో 2వేలమంది పేదలకు ఆగస్టులో శాశ్వత ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి ఏర్పాట్లు చేయాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే 3వేలమందికి వెయ్యికోట్ల విలువైన ఇళ్లపట్టాలు అందజేశామని గుర్తు చేస్తూ, ఇల్లు లేని వారికి టిడ్కో గృహ సముదాయాల స్థలాల కోసం ప్రణాళికలు రూపొందించాలన్నారు.

మంగళగిరి టిడ్కో సముదాయానికి సమీపంగా పార్కు అభివృద్ధి చేయాలని, ఎంటిఎంసి పరిధిలో సమీకృత అండర్ గ్రౌండ్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని త్వరగా ప్రారంభించాలని సూచించారు. 31 కమ్యూనిటీ హాళ్లు, 26 పార్కులు, శ్మశానాల నిర్మాణాలు త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు.

మహానాడు కాలనీలో వరద నివారణ కోసం నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్‌తోపాటు పార్కును కూడా అభివృద్ధి చేయాలన్నారు. శివాలయం పక్కన మోడల్ లైబ్రరీ పనులు తుదిదశకు చేరాయని అధికారులు వివరించారు. నిడమర్రు మోడల్ పునర్నిర్మాణ పనులను సెప్టెంబర్‌లోగా పూర్తిచేయాలని, దేవాలయ ప్రణాళికను వేగవంతం చేయాలని చెప్పారు.

స్మార్ట్ స్ట్రీట్ బజార్, 350 షాపులతో నిడమర్రు రోడ్ మార్కెట్, రూ.2 కోట్లు వ్యయంతో చేపల మార్కెట్, పోలకంపాడు వద్ద నిర్మాణాలు త్వరగా ప్రారంభించాల్సిన అవసరముందని తెలిపారు. మంగళగిరి ఎకో పార్కును అడ్వెంచర్ పార్కుగా అభివృద్ధి చేయాలని సూచించారు. రహదారుల సుద్దీకరణ, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, వీధిలైట్ల అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు.

జెమ్స్ అండ్ జ్యుయలరీ పార్క్, చెరువుల అభివృద్ధి పై కూడా చర్చించారు. ఈ సమీక్ష సమావేశంలో మున్సిపల్ కమిషనర్ హలీమ్ బాషా, ఎండోమెంట్స్ కమిషనర్ రామచంద్ర మోహన్, ఎంటిఎంసి ఎస్ఈ శ్రీనివాసరావు తదితర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *