ఐఐఎం కోల్‌కతాలో చదువుతోన్న విద్యార్థినిపై సహచర విద్యార్థి అత్యాచారం చేసిన ఘటనపై కేసు నమోదైంది.

బాధితురాలు మత్తు మందు కలిపిన డ్రింక్ తాగిన తర్వాత స్పృహ కోల్పోయి, అనంతరం లైంగిక దాడి జరిగినట్లు పోలీసులకు తెలిపింది

An IIM Kolkata student has filed a police complaint against a fellow student, alleging he raped her after giving her a spiked drink. A case has been registered and the accused is in custody.

ఐఐఎం కోల్‌కతాలో చదువుతోన్న విద్యార్థినిపై సహచర విద్యార్థి అత్యాచారం చేసిన ఘటనపై కేసు నమోదైంది. బాధితురాలు మత్తు మందు కలిపిన డ్రింక్ తాగిన తర్వాత స్పృహ కోల్పోయి, అనంతరం లైంగిక దాడి జరిగినట్లు పోలీసులకు తెలిపింది.
An IIM Kolkata student has filed a police complaint against a fellow student, alleging he raped her after giving her a spiked drink. A case has been registered and the accused is in custody.

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ప్రముఖ విద్యాసంస్థ **ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)**లో విద్యనభ్యసిస్తున్న ఓ యువతిపై అదే సంస్థలో చదువుతున్న మరో విద్యార్థి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి వాంగ్మూలం ప్రకారం, మానసికంగా కృంగిపోయిన సమయంలో ఆమె స్నేహితుడు ‘కౌన్సిలింగ్ చేస్తాను’ అంటూ హాస్టల్‌కు రమ్మన్నాడు. హాస్టల్‌లో ఆమెకు మత్తు మందు కలిపిన కూల్‌డ్రింక్ ఇచ్చి, స్పృహ కోల్పోయిన తరువాత ఆమెపై అత్యాచారం చేశాడు.

ఆమెకు స్పృహ వచ్చిన తర్వాత జరిగిన విషయాన్ని గ్రహించి అతడిని ప్రశ్నించగా, ఈ విషయం బయటకు చెప్పినట్లయితే చంపేస్తానని బెదిరించాడు. బాధితురాలు వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. పోలీసులు అత్యాచారానికి సంబంధించిన కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. అనంతరం అతన్ని రిమాండ్‌కు తరలించారు.

ఇటీవల కోల్‌కతాలోని ఓ జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనతో పాటు న్యాయ విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులు కూడా దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో, తాజా ఘటనపై నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది.

A serious sexual assault case has been registered at IIM Kolkata, where a female student accused her male classmate of raping her after giving her a sedative-laced drink. According to the complaint, the accused invited the victim to the hostel under the pretext of offering mental health support.

She alleged that he served her a cold drink mixed with sedatives, after which she lost consciousness. The sexual assault reportedly occurred during that period. Upon regaining consciousness, she confronted the accused, who allegedly threatened her not to disclose the incident. The survivor approached the local police, leading to the registration of a rape case.

The accused has been arrested and remanded in judicial custody. The incident comes in the wake of recent high-profile crimes in Kolkata, including the rape and murder of a junior doctor and a gang rape involving a law student — incidents that have sparked public outrage and renewed focus on women’s safety in West Bengal.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *