English News Headline
Malkajgiri Police Intensify Visible Policing, Vehicle Checks and Cybercrime Awareness

Full Telugu News Article
హైదరాబాద్: ప్రజల భద్రతే లక్ష్యంగా మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో పోలీసులు క్షేత్రస్థాయిలో నిరంతరం అప్రమత్తంగా ఉంటున్నారు. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా విజిబుల్ పోలీసింగ్, వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తూ, రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనల పాటింపు, నేరాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
అదేవిధంగా సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఆన్‌లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద పరిణామాలు ఎదురైనప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.
నేరాల నియంత్రణలో సీసీటీవీ కెమెరాల ప్రాధాన్యత, వాటి ఉపయోగంపై కూడా ప్రజలకు అవగాహన కల్పించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
ప్రజలతో మమేకమై, వారి భాగస్వామ్యంతో సురక్షితమైన సమాజ నిర్మాణానికి మల్కాజిగిరి పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు.
Full English News Article
Hyderabad: Malkajgiri police are maintaining a continuous field-level presence across the commissionerate with a focus on public safety. As part of community policing, personnel have been conducting visible policing and vehicle checks.
Cases are being registered against traffic violators while awareness is being created among the public about road safety, compliance with traffic rules and crime prevention.
Police also conducted a cybercrime awareness programme and advised people to remain alert against cyber offences and suspicious online activities.
The importance of CCTV cameras in preventing and detecting crime was also explained to the public. People were advised to immediately inform the police if they notice any suspicious persons or activities.