
సికింద్రాబాద్‌లో అంతరాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్ – Inter-State Ganja Smuggling Racket Busted at Secunderabad Railway Station
Secunderabad railway police busted an inter-state ganja smuggling gang and arrested four accused, including three women, seizing 46 kg of cannabis worth ₹22.93 lakh. The gang, hailing from Maharashtra, was transporting the contraband from Odisha. The arrest took place during a surprise raid at the railway station, led by GRP officers with support from RPF and Eagle Team units.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిపిన ఆకస్మిక తనిఖీల్లో అంతరాష్ట్ర గంజాయి ముఠా పోలీసులకు చిక్కింది. ముగ్గురు మహిళలు, ఒక పురుషుడు కలిసిన నలుగురు మహారాష్ట్ర వాసులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 46 కిలోల గంజాయి (రూ.22.93 లక్షల విలువైనది) స్వాధీనం చేసుకున్నారు.
గంజాయిని ఒడిశా నుండి మహారాష్ట్రకు రవాణా చేస్తున్నట్లు జీఆర్పీ డీస్పీ జావేద్ తెలిపారు. ఈ దాడిలో జీఆర్పీ పోలీసుల ఆధ్వర్యంలో ఆర్పీఫ్ మరియు ఈగల్ టీం సిబ్బంది పాల్గొన్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించామని, తదుపరి విచారణ కొనసాగుతున్నదని డీస్పీ పేర్కొన్నారు.