YSRCP leaders launch “Vennupotu” book in Nandavaram, slam coalition government for Telugu News and English News kindly scroll down

నందవరం కేంద్రంలో ‘వెన్నుపోటు’ పుస్తక ఆవిష్కరణ – కూటమి ప్రభుత్వంపై వైయస్సార్ కాంగ్రెస్ ఆరోపణలు
నందవరం, జూన్ 17:
ఎమ్మిగనూరు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బుట్టా రేణుక ఆదేశాల మేరకు నందవరం మండల కేంద్రంలోని మూడు రోడ్ల కూడలిలో “వెన్నుపోటు” పుస్తకాన్ని పార్టీ మండల అధ్యక్షుడు జే. శివారెడ్డి నేతృత్వంలో ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మేధావుల ఫోరం సంయుక్త కార్యదర్శి కె.ఆర్. లక్ష్మీకాంత్ రెడ్డి, బీసీ సెల్ సంయుక్త కార్యదర్శి వీరుపాక్షి రెడ్డి, జెడ్పీటీసీ నిఖిల్ చక్రవర్తి, సీనియర్ నాయకులు కె.ఆర్. రామకోటేశ్వర్ రెడ్డి, ప్రచార విభాగ అధ్యక్షుడు చాంద్ భాష, ఉపాధ్యాయుడు కోటేశ్వర్ రావు, ప్రధాన కార్యదర్శి పేట శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాయకులు మాట్లాడుతూ, ఎన్నికల హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదని విమర్శించారు. సంక్షేమాన్ని విస్మరించి కక్షసాధక ధోరణిలో పాలన సాగుతుందని తెలిపారు.
రాష్ట్రాన్ని హత్యలు, అత్యాచారాలు, నేరాలకు కేంద్రంగా మార్చినట్లు వ్యాఖ్యానించారు. టీడీపీ నేతల దాడులపై కేసులే పెట్టకపోతే, వైయస్సార్ కాంగ్రెస్ నేతలపై పాత కేసులు తెరిచి జైళ్లకు పంపిస్తున్నారని ఆరోపించారు.
పింఛన్, రైతు భరోసా, నేతన్న నేస్తం, నిరుద్యోగ భృతి, ఉచిత బస్సు సేవలు వంటి హామీలన్నీ అమలుకాలేదని, జిల్లాలకే పరిమితమైన ఉచిత బస్సు సేవలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు-నేడు, ఆరోగ్యశ్రీ వంటి పథకాల అమలుపై సందేహాలు వ్యక్తం చేశారు.
ఒకే ఏడాదిలో రూ.1.54 లక్షల కోట్ల అప్పు చేసిన ఈ ప్రభుత్వం ఒక్క పథకాన్నీ పూర్తిగా అమలు చేయలేదని విమర్శించారు. కోవిడ్ సమయంలోనూ సంక్షేమంపై రాజీపడని జగన్ పాలనను గుర్తు చేస్తూ, ప్రస్తుత ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని నాశనం చేసిందని అన్నారు.
కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటలకు కట్టుబడి, ప్రజానుకూలంగా పారదర్శక పాలన కొనసాగించాలని నేతలు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో నందవరం సర్పంచ్ తోట సావిత్రి, మిట్ట సోమాపురం సర్పంచ్ నరసింహులు, పెద్ద కొత్తిలి శివన్న, ఎంపీటీసీ కోతి ఈరన్న, హెచ్. బాపురం హరి రెడ్డి, గురూజాల నరసింహ రెడ్డి, రాయిచోటి నరసింహ రెడ్డి, పల్లె శంకర్ రెడ్డి, చిన్న కొత్తిలి సోమన్న, జగ్గాపురం నరసరాజు, ఎల్లా గౌడ్, మీసలా సంపత్ గౌడ్, ధర్మపురం సుధాకర్, యువనాయకులు సూర్యప్రకాష్ రెడ్డి, ఇబ్రహీంపురం ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
YSRCP Leaders Launch “Vennupotu” Book in Nandavaram, Accuse Coalition Government of Betrayal
Nandavaram, June 17:
Following the directive of Emmiganur YSRCP in-charge Butta Renuka, party leaders organized the launch of the political book “Vennupotu” at the Three Roads Junction in Nandavaram mandal. The event was held under the leadership of mandal YSRCP president J. Shiva Reddy.
Key leaders including KR Lakshmikant Reddy (State Intellectuals Forum Joint Secretary), Veerupakshi Reddy (BC Cell Joint Secretary), ZPTC member Nikhil Chakravarthy, senior leader KR Ramakoteswar Reddy, publicity wing president Chand Basha, teacher Koteshwar Rao, mandal general secretary Peta Srinivas Reddy and others participated in the launch.
Speaking to the media, the leaders accused the coalition government of betraying the people by failing to implement election promises even after one year. They criticized the administration for neglecting welfare policies and pursuing revenge-driven politics.
They alleged that while the previous YSRCP government upheld public welfare even during the COVID crisis, the present coalition has converted the state into a hub for crime, murder, and injustice. Not a single case has been filed against TDP leaders who attacked people, but old cases against YSRCP leaders are being reopened under the “Red Book” strategy to create fear, they said.
The leaders lamented that schemes like pensions, Rythu Bharosa, Nethanna Nestham, unemployment allowance, and free bus services were completely ignored. Even free bus services are limited to certain districts, they noted.
They questioned the government’s failure in properly implementing vital schemes like Nadu-Nedu and Aarogyasri and pointed out that despite borrowing ₹1.54 lakh crore in a year, not even one welfare scheme has been fully implemented.
They urged the coalition government to honor its promises, ensure transparency, and follow a people-centric governance model.
Local leaders and sarpanches including Tota Savitri, Narasimhulu (Mitt Somapuram), Shivanna (Pedda Kothili), MPDC Koti Eeranna, Hari Reddy (H Bapuram), Narasimha Reddy (Gurujala and Rayachoti), Shankar Reddy (Palle), Somanna (Chinna Kothili), Narasaraju (Jagga Puram), Ella Goud, Sampath Goud, Sudhakar (Dharmapuram), and youth leaders Surya Prakash Reddy and Ibrahim Puram Prakash Reddy were also present.