రెబల్ స్టార్ ప్రభాస్ “రాజా సాబ్” మూవీకి ఆకర్షణగా నిలవనున్న రికార్డ్ స్థాయి హారర్ హవేలీ సెట్

Prabhas’ Raja Saab Features India’s Biggest Haunted Mansion Set for a Horror Film for English News and Telugu News kindly scroll down

రెబల్ స్టార్ ప్రభాస్ “రాజా సాబ్” మూవీకి ఆకర్షణగా నిలవనున్న రికార్డ్ స్థాయి హారర్ హవేలీ సెట్

ప్రభాస్, మారుతి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హారర్ కామెడీ ఎంటర్టైనర్ “రాజా సాబ్” డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా 41,256 చదరపు అడుగుల విస్తీర్ణంలో హవేలీ సెట్‌ను నిర్మించారు. ఇదివరకు భారతీయ హారర్ సినిమాల చరిత్రలో ఇంత భారీ హవేలీ సెట్ రూపొందించలేదు.

ఈ సెట్‌ను ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ నంబియార్ రూపకల్పన చేశారు. “హవేలీలో ప్రతి అడుగు ఓ భావోద్వేగాన్ని వ్యక్తపరుస్తుంది. చూడడానికి మాత్రమే హాంటెడ్ హౌస్ కాదు… చూడగానే కథలోకి తీసుకెళ్లేలా ఉంటుంది,” అని రాజీవన్ తెలిపారు.

జూన్ 16న “రాజా సాబ్” టీజర్ లాంచ్ సందర్భంగా నేషనల్, స్టేట్ మీడియా ప్రతినిధులకు హవేలీని ప్రత్యక్షంగా చూపించనున్నారు. సినిమా షూటింగ్‌లోనూ, ప్రమోషన్‌లోనూ ఈ హవేలీ ప్రధాన పాత్ర పోషించనుంది.

దర్శకుడు మారుతి హారర్ కామెడీ జానర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రంగా రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో, అన్‌కాంప్రమైజ్డ్ ప్రొడక్షన్ క్వాలిటీలో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని టీ.జి. విశ్వప్రసాద్ People Media Factory పై నిర్మిస్తున్నారు.

ఈసారి ప్రభాస్ రొమాంటిక్ హారర్ జానర్‌లో కనిపించనున్నాడు. ఇది ఆయన కెరీర్‌లో తొలిసారి. ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Rebel Star Prabhas’ upcoming film “Raja Saab”, directed by Maruthi and produced by People Media Factory, is set for a grand theatrical release on December 5 in five Indian languages. A massive 41,256 sq.ft haunted haveli set, designed by renowned art director Rajeevan Nambiar, is the standout element of the movie. The team claims it’s the largest horror set ever built in Indian cinema history.

Rajeevan shares, “Every step in the Haveli evokes emotion. It’s not just a haunted house to look at; you’ll feel immersed in the story as soon as you see it.”

The teaser of Raja Saab will be launched on June 16, and media personnel will be given a real-time tour of the Haveli set. The film is shaping up as a high-value horror-comedy entertainer with uncompromised production.

Director Maruthi aims to deliver an evergreen film in this genre, while producer TG Vishwa Prasad backs the vision with grand scale execution. This is also Prabhas’ first full-fledged romantic horror role, building strong anticipation among fans.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *