నెలల రేషన్ ఇంకా తీసుకోలేదా? మీకు బిగ్ అలర్ట్!

Big Alert: Telangana Extends Ration Deadline – Full Details of English News and Telugu News kindly Scroll down

నెలల రేషన్ ఇంకా తీసుకోలేదా? మీకు బిగ్ అలర్ట్!

తెలంగాణలో మూడు నెలల (జూన్, జూలై, ఆగస్ట్) రేషన్‌ను ఒకేసారి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే కొన్ని ప్రాంతాల్లో స్టాక్‌ సమస్యలు తలెత్తడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

గడువు ముగిసిపోతుందేమోనని కంగారు పడుతున్న కార్డుదారులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రేషన్‌ పంపిణీ గడువును జూన్‌ 30వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

పౌరసరఫరాల శాఖ ప్రకారం, ప్రతి కార్డుదారుడికి జూన్‌ 30లోగా తమ కోటా అందుతుందని తెలిపింది. అన్ని రేషన్‌ షాపులు ఉదయం, సాయంత్రం పనిచేస్తాయని స్పష్టం చేశారు.

హైదరాబాద్ జిల్లాలో ఇప్పటికే 48% మందికి రేషన్ పంపిణీ పూర్తయిందని అధికారులు తెలిపారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

రేషన్ బియ్యాన్ని ఇతరులకు విక్రయిస్తే కార్డు రద్దుతోపాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వర్షాకాలం దృష్ట్యా కేంద్రం ఇచ్చిన సూచనలతో ఈ ఏర్పాట్లు చేపట్టినట్టు తెలిపారు. బయోమెట్రిక్ ధృవీకరణ ప్రతి నెల వేరుగా చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

Big Alert if You Haven’t Collected Your Ration Yet

In Telangana, the government had earlier announced the distribution of a 3-month ration stock (June, July, and August) all at once. However, due to a lack of stock in some areas, several beneficiaries faced difficulties.

Fearing that they might miss out if the deadline ends, many ration cardholders expressed anxiety. In response, the Telangana government has given a big relief – extending the ration distribution deadline to June 30.

According to the Civil Supplies Department, every ration cardholder will receive their rightful share before June 30. Officials confirmed that all shops will operate till then, both in morning and evening hours.

In Hyderabad district alone, 48% of cardholders have already received the 3-month supply. Strict surveillance has been put in place to ensure smooth and fair distribution. Authorities warned that those who attempt to resell government rice will face cancellation of cards and legal action.

The central government had advised states to distribute rations early due to monsoon-related difficulties. Following this, Telangana initiated bulk distribution. Bio-metric verification for each month must still be done separately, officials clarified.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *