‘వార్ 2’ డబ్బింగ్ ప్రారంభించిన ఎన్టీఆర్ – పాన్ ఇండియా యాక్షన్ చిత్రానికి అభిమానుల్లో అంచనాలు తారాస్థాయిలో

Jr NTR Begins Dubbing for ‘War 2’ – YRF Spy Universe’s Most Awaited Action Film Tollywood in English kindly scroll down

‘వార్ 2’ డబ్బింగ్ ప్రారంభించిన ఎన్టీఆర్ – పాన్ ఇండియా యాక్షన్ చిత్రానికి అభిమానుల్లో అంచనాలు తారాస్థాయిలో

హైదరాబాద్, జూన్ 11:
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బాలీవుడ్ యాక్షన్ స్పై థ్రిల్లర్ ‘వార్ 2’ కోసం డబ్బింగ్ ప్రారంభించారు. ఆదిత్య చోప్రా నిర్మాణంలో, అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యష్ రాజ్ ఫిల్మ్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమా YRF స్పై యూనివర్స్ లో ఆరవ భాగంగా వస్తోంది. ఇందులో ఎన్టీఆర్ తో పాటు బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, కియారా అద్వానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆగస్టు 14, 2025 న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

ఇటీవల ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ‘వార్ 2’ టీజర్ యూట్యూబ్‌ను షేక్ చేసింది. అద్భుతమైన విజువల్స్, యాక్షన్ మేకింగ్‌తో టీజర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. ప్రస్తుతం ఎన్టీఆర్ డబ్బింగ్ చేస్తున్న వీడియోను మేకర్స్ విడుదల చేయగా, అది అభిమానులను ఆకట్టుకుంటోంది.

ఈ చిత్రం పాన్-ఇండియా స్థాయిలో విడుదలకాబోతున్నందున, అన్ని భాషల్లో ఎన్టీఆర్ డబ్బింగ్ స్వయంగా చెబుతున్నాడన్నది ఫ్యాన్స్‌కు గర్వకారణంగా మారింది. రాబోయే రోజుల్లో ఈ సినిమా గురించి మరిన్ని అప్డేట్స్ రావచ్చునని సమాచారం.

Mass Hero Jr NTR Begins Dubbing for ‘War 2’ – Fans Buzzing with Pan-India Anticipation

Hyderabad, June 11:
Pan-India star Jr NTR, popularly known as Man of Masses, has kickstarted the dubbing work for the high-octane action spy thriller ‘War 2’, directed by Ayan Mukerji and produced by Aditya Chopra under Yash Raj Films.

The film is the sixth installment in the YRF Spy Universe, featuring an ensemble cast including Hrithik Roshan, Jr NTR, and Kiara Advani. It is slated for a grand global theatrical release on August 14, 2025.

The recently released War 2 teaser, unveiled on NTR’s birthday, created a sensation across India. With explosive visuals and adrenaline-pumping action, the teaser raised massive expectations. Now, a video of NTR dubbing for the film is winning hearts online, adding fuel to the excitement.

Fans are thrilled that NTR is lending his own voice in multiple languages for this ambitious project. The film promises a next-level cinematic experience and is one of the most awaited releases of 2025.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *