
సూపర్ సిక్స్ లో మరో హామీకి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ – రేపటి నుంచి తల్లికి వందనం
అమరావతి:
సూపర్ సిక్స్ హామీల అమలులో మరో ముఖ్యమైన అడుగు ముందుకేశారు సీఎం చంద్రబాబు. ‘‘తల్లికి వందనం’’ పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఈ పథకాన్ని గురువారం ప్రారంభించనున్నారు.
ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 67,27,164 విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ. 8,745 కోట్ల నిధులను నేరుగా జమ చేయనున్నారు. మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లుగా, ప్రతి విద్యార్థికి ఆయా తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. పిల్లల సంఖ్యకు అనుగుణంగా సాయం అందుతుంది.
1వ తరగతి నుండి ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో చేరే విద్యార్థుల తల్లులకూ ఈ పథకం వర్తిస్తుంది. అడ్మిషన్లు పూర్తైన తర్వాత వారితో సంబంధించిన డేటా సేకరించాక, ఆయా తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నట్టు అధికారులు తెలిపారు.
ఈ పథకం అమలుకు సంబంధించి బుధవారం నాడు జి.ఓ విడుదలైంది. ఇప్పటికే సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా పింఛన్ల పెంపు, అన్నా క్యాంటీన్లు, మెగా డీఎస్సీ, దీపం-2 పథకం వంటి కీలక నిర్ణయాలు అమలులోకి వచ్చిన సంగతి తెలిసిందే.
Another Big Promise from Super Six Gets Green Signal – ‘Talli Ki Vandanam’ Scheme Launch on Thursday
Amaravati:
In a major step toward implementing the “Super Six” promises, Chief Minister N. Chandrababu Naidu has approved the launch of the “Talli Ki Vandanam” scheme. The initiative, dedicated to honoring mothers, will officially roll out on Thursday, marking one year since the coalition government took charge.
As part of this scheme, financial assistance of ₹8,745 crores will be directly credited to the accounts of 67,27,164 mothers of school and college-going students. The CM reiterated that this was a manifesto promise, and the amount will be disbursed proportionally based on the number of children.
Children joining Class 1 and Intermediate 1st Year are also eligible. Once admissions are completed and data is compiled, funds will be transferred to the mothers’ bank accounts.
The government issued an official G.O. on Wednesday, finalizing the operational guidelines. This becomes the next key implementation after other Super Six promises like Pension Hike, Anna Canteens, Mega DSC, and Deepam-2 Scheme have already been launched.