
దేశంలో ఏ జాతీయస్థాయి పరీక్షలు జరిగిన తెలుగు విద్యార్థులు సత్తా చాటుతున్నారు. టాప్ ర్యాంకులతో దూసుకుపోతున్నారు. జేఈఈ, నీట్, యూపీఎస్సీ పరీక్షలలో టాప్ ర్యాంకులతో దుమ్ము రేపారు. ముఖ్యంగా జేఈఈ మెయిన్, నీట్, జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో ప్రథమ ర్యాంకులను తెలుగు రాష్ట్రాల విద్యార్థులే దక్కించుకొని జాతీయస్థాయిలో ప్రత్యేకతను సాధించారు.ఏప్రిల్ 30న వెల్లడైన జేఈఈ మెయిన్‌లో హైదరాబాద్‌కు చెందిన సింగరాజు వెంకట కౌండిన్య 300కి 300 మార్కులు దక్కించుకొని మొదటి ర్యాంకు సాధించగా.. జూన్ 13న వెల్లడైన నీట్‌యూజీ ఫలితాల్లో ఏపీలోని శ్రీకాకుళానికి చెందిన బోర వరుణ్ చక్రవర్తి 720కి 720 మార్కులతో ప్రథమ ర్యాంకు పొందాడు.తాజాగా జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో హైదరాబాద్‌కు చెందిన వావిలాల చిద్విలాస్‌రెడ్డి 360కి 341 మార్కులు సాధించి తొలి ర్యాంకు కైవసం చేసుకున్నాడు. మరోవైపు బాలికల విభాగంలో 298 మార్కులతో హైదరాబాద్ జోన్‌కు చెందిన నాగ భవ్యశ్రీ బాలికల విభాగంలో ప్రథమ స్థానంలో నిలవడం విశేషం. అయితే జాతీయ స్థాయిలో 56వ ర్యాంకులో నిలిచింది.జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో గత కొద్ది సంవత్సరాలుగా తగ్గుతూ వచ్చిన కటాఫ్ మార్కులు ఈసారి మాత్రం భారీగా పెరిగాయి. 2021లో 360 మార్కులకు కటాఫ్ 63 మార్కులుగా, 2022లో 360కి 55 మార్కులుగా ఉంది, అయితే ఈసారి కటాఫ్ మార్కులు ఏకంగా 86కు పెరగడం విశేషం. 2021, 22 సంవత్సరాల్లో కరోనా ప్రభావంతో విద్యార్థులు తగినంత ప్రతిభ చూపలేకపోయారని నిపుణులు చెబుతున్నారు. గతేడాదితో పోల్చితే ఈసారి పరీక్ష కఠినంగా ఉందని భావించినప్పిటికీ.. అందుకు భిన్నంగా విద్యార్థలు మార్కులు సాధించారు.గతానికి భిన్నంగా ఈసారి పోటీపడిన వారి సంఖ్య భారీగా పెరిగింది. అడ్వాన్స్‌డ్‌లో కూడా నెగ్గగలమన్న ధీమా కూడా విద్యార్థుల్లో పెరిగింది. ముఖ్యంగా అమ్మాయిలు కూడా ఆత్మవిశ్వాసంతో పోటీపడ్డారు. దానికితోడు భౌతికశాస్త్రంలో ఈసారి 6 మార్కులు కలపడం కలిసొచ్చింది. ఈ ఏడాది కేటగిరీల వారీగా కటాఫ్ మార్కులను జనరల్86, ఓబీసీ77, ఈడబ్ల్యూఎస్77, ఎస్సీ43, ఎస్టీ43గా నిర్ణయించారు.ఐఐటీల్లో బీటెక్ సీట్ భర్తీకి నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలను జూన్ 18న విడుదల చేసిన సంగతి తెలిసిందే. జూన్ 4న జరిగి పరీక్షకు దాదాపు 1.80 లక్షల మంది విద్యార్ధులు హాజరయ్యారు. వీరిలో 1,39,727 మంది అబ్బాయిలు ఉండగా.. 40,645 మంది అమ్మాయిలు ఉన్నారు. ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో మొత్తం 43,773 మంది అర్హత సాధించారు. వీరిలో అబ్బాయిలు 36,264 మంది, అమ్మాయిలు 7,509 మంది ఉన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు 30 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు ఈ పరీక్షలో కటాఫ్ మార్కులు నిర్ణయించి సుమారు 45 వేల మందిని జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ కౌన్సిలింగ్‌కు అర్హత కల్పిస్తారు. ఇక ఆల్ ఇండియా పబ్లిక్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి యూపీఎస్సీ నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్షల తుది ఫలితాలు వెలువడ్డాయి. టాప్ 4 ర్యాంకులు అమ్మాయిలు హస్తగతం చేసుకోగా, తెలుగు విద్యార్ధులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు.యూనియన్ పబ్లిక్ సర్వీస్ కవిూషన్ నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్షలు ఫైనల్ రిజల్ట్స్ వచ్చేశాయి. తెలుగు విద్యార్ధులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చడమే కాకుండా మంచి ర్యాంకులు సాధించారు. ఓవరాల్‌గా దేశవ్యాప్తంగా మొదటి నాలుగు ర్యాంకుల్ని అమ్మాయిలే కైవసం చేసుకోవడం విశేషం. ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్‌గా ఇషితా కిశోర్, రెండవ ర్యాంకర్‌గా గరిమా లోహియా, మూడవ ర్యాంకర్‌గా ఉమా హారతి, నాలుగవ ర్యాంకర్‌గా స్మృతి మిశ్రా నిలిచారు. దేశవ్యాప్తంగా మొత్తం 933 మందిని యూపీఎస్సీ ఎంపిక చేయగా అందులో ఐఏఎస్ విభాగానికి 180 మంది, ఐఎఫ్‌ఎస్ విభాగానికి 38, ఐపీఎస్ విభాగానికి 200 మంది ఎంపికయ్యారు. రిజర్వేషన్ల ప్రకారమైతే జనరల్ కోటాలో 345, ఓబీసీలో 263, ఈడబ్ల్యూఎస్‌లో 99, ఎస్సీలో 154, ఎస్టీలో 72 మంది ఉన్నారు. సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో తెలుగు విద్యార్ధులు సత్తా చాటారు. పెద్దఎత్తున ర్యాంకులు కైవసం చేసుకున్నారు. నారాయణపేటకు చెందిన ఉమా హారతి ఆల్ ఇండియా మూడవ ర్యాంకు సాధించారు. తెలుగు రాష్ట్రాల్లో టాప్ ర్యాంకర్ ఈమెనే. తిరుపతికి చెందిన పవన్ దత్తా 22వ ర్యాంకు సాధించారు. రాజమండ్రికి చెందిన తరుణ్ పట్నాయక్ 33వ ర్యాంకు సాధించారు. వరంగల్‌కు చెందిన అర్హిత్ 40వ ర్యాంకు పొందారు. తెలుగు విద్యార్ధులు దక్కించుకున్న ఇతర ర్యాంకులు ఇలా ఉన్నాయి..