
హైదరాబాద్ : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ జిల్లా శాఖ టిబి కన్వీనర్ డా విజయ్ భాస్కర్ గౌడ్ అధ్వర్యంలో రెడ్ క్రాస్ హైదరాబాద్ చైర్మన్ మామిడి భీమ్ రెడ్డి సమక్షంలో శ్రీ విద్యా సెకండరీ స్కూల్ వ్యవస్తాపకులు మధు సూదన్ రెడ్డి సహాయం తో ఫీవర్ హాస్పిటల్ లో క్షయ వ్యాధి రోగులు కు టిబి కిట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ భీమ్ రెడ్డి మాట్లాడుతూ మరింత మంది దాతలు ముందుకు వచ్చి క్షయ వ్యాధి రోగుల ను ఆదుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ క్షయ వ్యాధి పట్ల అవగాహన కలిగి ఉండాలని తెలియజేశారు.