ముఖ్యమంత్రి అధ్యక్షతన నూతన సెక్రటేరియట్ భవనంలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి కేబినేట్ సమావేశంలో అన్ని వర్గాల వారిని సంతృప్తి పరిచేలా నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ సమావేశం ముగిసిన తరువాత, కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సచివాలయ మీడియా పాయింట్ వద్ద మీడియాకు వివరించిన మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస యాదవ్, గంగుల కమలాకర్, మల్లారెడ్డి, ప్రశాంత్ రెడ్డి.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి అని నిర్ణయించినట్లుగా తెలిపారు. 21 రోజుల పాటు అన్ని నియోజక వర్గాల్లో సంబరాలు నిర్వహించనున్నారు. కులవృత్తుల వారి అభివృద్ధి కోసం మంత్రి గంగుల, ఆధ్వర్యంలో క్యాబినెట్ సబ్ కమిటీ వేయాలని కేబినెట్ నిర్ణయం, విధివిధానాలు రూపొందించే బాధ్యత కూడా సదరు మంత్రికే అప్పగింత. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించేలా యోచన. 84 గ్రామాల ప్రజలు విజ్ఞప్తి మేరకు, ఇచ్చిన హామీని సీఎం నిలబెట్టుకుంటూ 111 జీఓ పూర్తిగా ఎత్తివేస్తూ నిర్ణయం. ఎచ్ ఎం డి ఏ భూముల వలే, ఈ గ్రామాలకు కూడా అవే రూల్స్ వర్తిస్తాయి. హిమాయత్ సాగర్, గండిపేట జలాశయాలు కాపాడేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు. వీటితో పాటు మూసిని కాళేశ్వరం జలాలతో లింక్ చేయాలని నిర్ణయం. ఆరోగ్య శాఖలో రి ఆర్గనైజిగ్ , 33 జిల్లాలో 33 డి ఎం హెచ్ ఓ లు పోస్టుల జారీ. హైదరాబాద్ పట్టణ జనాభాకు మరింత వైద్య సేవలు అందేలా జి హెచ్ యం సి 6 జోన్లకు అనుగుణంగా 6 డి ఎం హెచ్ ఓ లు. ఇక మీదట రాష్ట్రంలో మొత్తం 39 DMHO పని చేయనున్నారు. 40 మండలాల్లో కొత్త ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మంజూరు చేయాలని నిర్ణయించిన కేబినెట్. అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు లలో ఇప్పటి వరకు కాంట్రాక్టు ఉద్యోగులు పని చేస్తున్నందున, ఇప్పడు పర్మినెంట్ గా ఉద్యోగులను తీసుకోవాలని నిర్ణయం. రైతు పక్షపాతి అయిన సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగంలో మార్పుల కోసం, వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీ. వడగళ్ల వాన వల్ల ఎంతో నష్ట పోయినందున , పంట కాలం నెల ముందుకి జరపాలని ప్రణాళిక.
నాడు 10 జిల్లాలో 9 జిల్లాలు వెనుకబడ్డ జిల్లాలే. తెలంగాణ సాధన కెసిఆర్ పరిపాలన దక్షతతో నేడు దేశంలో అత్యధికంగా వరి పండించే రాష్ట్రంగా తెలంగాణ ఎదిగింది అంటే, దానికి సీఎం కేసీఆర్ నిర్ణయాలు కారణమని మంత్రి హరీష్ రావు అన్నారు.
అకాల వర్షాల వల్ల నష్టపోకూడదని నెల ముందు పంట జరపాలని యోచన. ఎలా ముందుకు తేవాలి అనే దానిపై సబ్ కమిటీ నివేదిక ఇస్తుంది. ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు, ఒక్క రైతు కూడా మోసపోవద్దు. దీనిపై కూడా సబ్ కమిటీ పని చేస్తుంది. మక్కలు, జొన్నలు కొనుగోలు చేసేలా ప్రభుత్వం తరుపున గ్యారెంటీ ఇస్తూ నిర్ణయం తీసుకున్న కాబినెట్. అచ్చం పేట ఉమా మహేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ఫేస్ 1, ఫేస్ 2 మంజూరు చేస్తూ కేబినెట్ నిర్ణయం.
(VRA) గ్రామ రెవెన్యూ అసిస్టెంట్లుల అందరని రెగ్యులారైజ్ చేయాలని నిర్ణయం. విధివిధానాలు ఖరారు చేయాలని సీసీ ఎల్ ఏ నవీన్ మిట్టల్ కు ఆదేశాలు జారీ. రెండో విడత గొర్రెల పంపిణీ 15 రోజుల్లో ప్రారంభించాలని నిర్ణయం. వనపర్తి జర్నలిస్టు అసోసియేశన్ కు 10 గంటల స్థలం కేటాయింపు. ఖమ్మం లో జర్నలిస్టుల ఇళ్ల కోసం 23 ఎకరాలు స్థలం కేటాయింపు. మైనార్టీ కమిషన్ లో జైన్ కమ్యూనిటీ యాడ్ చేస్తూ నిర్ణయం, కమిషన్ సభ్యులుగా ఒకరికి అవకాశం. టీఎస్పీఎస్సి లో మరింత పటిష్టమైన భద్రత కొరకు 10 పోస్టుల మంజూరు.