హకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్ పనులపై సీఎం రేవంత్ రెడ్డి పరిశీలన

English: CM Revanth Reddy Inspects Hakeempet Education Hub Works

హకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్ పనుల పురోగతిని పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి

వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం హకీంపేట్‌లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎడ్యుకేషన్ హబ్ నిర్మాణ పనుల పురోగతిని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వివిధ విద్యా సంస్థల భవన సముదాయాలను పరిశీలించి, నిర్మాణ నాణ్యత, సమన్వయం, సాంకేతిక అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు.

హకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్‌లో భాగంగా నిర్మిస్తున్న ప్రభుత్వ వైద్య, వెటర్నరీ, నర్సింగ్, ఫిజియోథెరపీ, పారామెడికల్, ఇంజనీరింగ్ కళాశాలల భవనాలతో పాటు 400 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను సీఎం పరిశీలించారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవనాలు, హాస్టళ్ల నిర్మాణాలను కూడా క్షేత్రస్థాయిలో ఒక్కొక్కటిగా పరిశీలించారు.

ఎడ్యుకేషన్ హబ్‌లో చేపట్టే అన్ని నిర్మాణ పనుల్లో వివిధ విభాగాల మధ్య సమన్వయం ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. నిర్మాణ నాణ్యతతో పాటు ఇతర సాంకేతిక అంశాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.

వర్షాకాలంలో నీరు నిలిచిపోకుండా వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. వర్షపు నీటిని ఒడిసిపట్టి భవిష్యత్ అవసరాలకు, ముఖ్యంగా ల్యాండ్‌స్కేపింగ్ పనులకు వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం కోడంగల్ నియోజకవర్గ పరిధిలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు.


CM Revanth Reddy Inspects Progress of Hakeempet Education Hub

Chief Minister A. Revanth Reddy inspected the progress of the prestigious Hakeempet Education Hub in Dudyal mandal of Vikarabad district. He visited the site and reviewed the construction of various educational institution buildings, while directing officials on quality, coordination and technical aspects.

As part of the Hakeempet Education Hub, the Chief Minister inspected the construction of government medical, veterinary, nursing, physiotherapy, paramedical and engineering college buildings, along with a 400-bed hospital. He also reviewed the buildings and hostel complexes being constructed for the Young India Integrated Residential School.

The Chief Minister directed officials to ensure coordination among all departments involved in the construction works at the Education Hub. He instructed them to continuously monitor construction quality and other technical aspects.

He further directed officials to establish water-harvesting wells to prevent water stagnation during the rainy season. Plans should be prepared to collect and conserve rainwater and utilise it for landscaping works, he said.

Later, the Chief Minister held a review meeting with senior officials on the progress of various development works in the Kodangal Assembly constituency.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *