ORR & Highway Safety Inspection

ఓఆర్‌ఆర్, హైవే భద్రతపై ట్రాఫిక్ డీసీపీ పరిశీలన
మల్కాజ్‌గిరి ట్రాఫిక్ పరిధిలో ఓఆర్‌ఆర్, హైవేలపై అత్యవసర సేవలు, గస్తీ, ప్రమాదాల నివారణ చర్యలను ట్రాఫిక్ డీసీపీ కే. రాహుల్ రెడ్డి, ఐపీఎస్ పరిశీలించారు. ఓఆర్‌ఆర్ మొబైల్ పెట్రోలింగ్ వాహనాలు, హైవే పెట్రోల్ వాహనం, అంబులెన్స్‌లు, ట్రామా సెంటర్ పనితీరును ఆయన సమీక్షించారు.
మూడు కొత్త ఓఆర్‌ఆర్ మొబైల్ పెట్రోల్ వాహనాలు, ఒక హైవే పెట్రోల్ మొబైల్ వాహనాన్ని డీసీపీ పరిశీలించి, వాటిలోని అత్యవసర పరికరాలు, సిబ్బంది సన్నద్ధతను సమీక్షించారు. హైవేలపై నిరంతర గస్తీ నిర్వహిస్తూ ప్రమాదాలు జరిగినప్పుడు వేగంగా స్పందించేలా వాహనాలు, సిబ్బంది సిద్ధంగా ఉండాలని సూచించారు.
అనంతరం ఓఆర్‌ఆర్ పరిధిలోని అంబులెన్స్‌లు, ట్రామా సెంటర్‌ను పరిశీలించారు. రోడ్డు ప్రమాదాల్లో ‘గోల్డెన్ అవర్’లో అందించే వైద్యం కీలకమని పేర్కొంటూ, ప్రమాదాల నివారణ, బాధితులకు తక్షణ సహాయం, అత్యవసర విభాగాల మధ్య సమన్వయంపై దృష్టి సారించారు. వేగవంతమైన స్పందన, సమర్థవంతమైన అత్యవసర సమన్వయం ద్వారా ప్రాణాలను కాపాడేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
Regular Patrolling • Quick Response • Save Lives
ORR and Highway Safety: Traffic DCP inspects patrol vehicles, ambulances and trauma care facilities
Malkajgiri Traffic DCP K. Rahul Reddy, IPS, inspected emergency response and road-safety arrangements on the ORR and highways, reviewing patrol vehicles, ambulances and the trauma centre.
The DCP inspected three new ORR Mobile Patrol Vehicles and one Highway Patrol Mobile, checking their emergency equipment and operational readiness for regular patrolling and swift response to highway emergencies.
He also inspected the ORR ambulances and Trauma Centre, stressing the importance of Golden Hour response in road accidents. Accident prevention, immediate assistance to victims and effective coordination among emergency services were highlighted as key measures for saving lives.
The inspection focused on strengthening regular patrolling, improving response time and ensuring effective emergency preparedness across the ORR and highway network.