గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను పరామర్శించిన సీఎం | Revanth Reddy Visits Governor

యశోద ఆస్పత్రిలో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను పరామర్శించిన సీఎం
అనారోగ్యంతో హైటెక్ సిటీలోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం పరామర్శించారు. గవర్నర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
హైదరాబాద్ హైటెక్ సిటీలోని యశోద ఆస్పత్రికి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అందుతున్న చికిత్సకు సంబంధించిన వివరాలను కూడా తెలుసుకున్నారు.
ముఖ్యమంత్రి వెంట ఎంపీ వేం నరేందర్ రెడ్డి ఉన్నారు. గవర్నర్ త్వరగా కోలుకోవాలని సీఎం ఆకాంక్షించారు.
గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అనారోగ్యంతో ఆగస్టు 26న యశోద ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో చికిత్స అనంతరం ఆగస్టు 27న డిశ్చార్జ్ అయినట్లు తాజా సమాచారం వెల్లడించింది.
CM Revanth Reddy Visits Governor Shiv Pratap Shukla at Yashoda Hospital
Telangana Chief Minister Revanth Reddy on Thursday visited Governor Shiv Pratap Shukla, who was undergoing treatment at Yashoda Hospital in Hitech City, Hyderabad. The Chief Minister enquired about the Governor’s health and treatment.
Reddy met the Governor at the hospital and sought details about his health condition and the treatment being provided. He wished the Governor a speedy recovery and good health.
MP Vem Narendar Reddy accompanied the Chief Minister during the visit.
Governor Shiv Pratap Shukla had been admitted to Yashoda Hospital on August 26 after falling ill. He was discharged from the hospital on August 27, according to the latest reports.