English News Headline
Telangana Rising Global Summit 2026: Preparations Reviewed by Cabinet Sub-Committee

Full Telugu News Article
తెలంగాణ రైజింగ్–ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై కేబినెట్ సబ్‌కమిటీ సమీక్ష నిర్వహించింది. మహాత్మా ఫూలే ప్రజాభవన్‌లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు పాల్గొన్నారు.
సమ్మిట్‌కు సంబంధించి వివిధ కమిటీలను మరింత బలోపేతం చేయడంపై సమావేశంలో చర్చించారు. కీలక అధికారులు, వివిధ రంగాల నిపుణులను కమిటీల్లో భాగస్వామ్యం చేయాలని నిర్ణయించారు.
సమ్మిట్ ఏర్పాట్లను వేగవంతం చేసేందుకు ప్రత్యేక వార్ రూమ్ ఏర్పాటు చేయడం, ఆహ్వానాల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయడం వంటి అంశాలను సమీక్షించారు.
గతంలో తెలంగాణ ప్రభుత్వం కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాల పురోగతిని కూడా సమావేశంలో పరిశీలించారు. ఆయా ఒప్పందాల అమలు స్థితి, తదుపరి చర్యలపై దృష్టి సారించారు.
తెలంగాణలో పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో దేశీయ, అంతర్జాతీయ రోడ్‌షోలు నిర్వహించడంపైనా సమావేశంలో చర్చ జరిగింది. పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలను సమ్మిట్‌కు ఆకర్షించేందుకు విస్తృత ప్రచార కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించారు.
Full English News Article
Preparations for the Telangana Rising–Invest Telangana Global Summit 2026 were reviewed at a Cabinet Sub-Committee meeting chaired by Deputy Chief Minister Bhatti Vikramarka at Mahatma Phule Praja Bhavan.
Chief Secretary Sanjay Jaju participated in the meeting, which focused on strengthening the committees responsible for organising the global investment summit. Experts from various sectors and key officials are proposed to be included to improve coordination and execution.
The meeting also reviewed plans to establish a dedicated War Room to monitor and coordinate summit-related activities. Officials discussed expediting the invitation process for investors, industry representatives and other key participants.
The progress of earlier Memoranda of Understanding signed by the Telangana government was also reviewed. The government is seeking to assess their implementation and accelerate follow-up action wherever required.
The Cabinet Sub-Committee further discussed conducting domestic and international roadshows as part of the investment outreach programme. The objective is to showcase Telangana as an investment destination and attract fresh investments through the Invest Telangana initiative.
The meeting underlines the government’s focus on coordinated preparations, investor outreach and follow-up on existing investment commitments ahead of the 2026 global summit.