టీజీఎస్ఆర్టీసీ టికెట్‌పై 10% డిస్కౌంట్ | TGSRTC Return Ticket Offer

టీజీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త.. రిటర్న్ టికెట్‌పై 10 శాతం డిస్కౌంట్
టీజీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త ప్రకటించింది. ఒకేసారి వెళ్లే ప్రయాణంతో పాటు తిరుగు ప్రయాణ టికెట్‌ను కూడా ముందస్తుగా బుక్ చేసుకునే ప్రయాణికులకు రిటర్న్ జర్నీ టికెట్ ధరపై 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు సంస్థ తెలిపింది.
ప్రయాణికులను ఆకట్టుకోవడంతో పాటు ముందస్తు రిజర్వేషన్లను ప్రోత్సహించే ఉద్దేశంతో టీజీఎస్ఆర్టీసీ ఈ కొత్త ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. “ఒక బుకింగ్.. రెండు ప్రయాణాలు.. ఎక్కువ మిగులు” అనే విధానంతో రౌండ్ ట్రిప్ బుకింగ్‌పై ఈ రాయితీని అందిస్తోంది.
ప్రయాణికులు తమ గమ్యస్థానానికి వెళ్లే టికెట్‌తో పాటు తిరుగు ప్రయాణ టికెట్‌ను కూడా ఒకేసారి బుక్ చేసుకోవాలి. అలా బుక్ చేసుకున్నప్పుడు తిరుగు ప్రయాణ టికెట్ ధరపై 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఈ రాయితీ అన్ని బస్సుల్లో అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు.
సుదూర ప్రాంతాలకు తరచుగా ప్రయాణించే మధ్యతరగతి ప్రజలకు ఈ ఆఫర్ ప్రయోజనకరంగా ఉండనుంది. ముఖ్యంగా పండుగలు, సెలవుల సమయంలో స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికులకు తిరుగు ప్రయాణ టికెట్‌ను ముందుగానే బుక్ చేసుకోవడం ద్వారా కొంత మొత్తాన్ని ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది.
ఇప్పటికే తెలంగాణలో మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం అమలులో ఉంది. పురుషులు, రిజర్వేషన్ చేసుకునే ఇతర ప్రయాణికులను ఆకర్షించేందుకు టీజీఎస్ఆర్టీసీ తాజాగా రిటర్న్ జర్నీపై 10 శాతం రాయితీని ప్రకటించింది.
English
TGSRTC Offers 10% Discount on Return Journey Tickets
TGSRTC has announced a new benefit for passengers booking round trips. Passengers who book their onward and return journey tickets together will receive a 10% discount on the fare of the return journey ticket.
The initiative is aimed at encouraging advance bookings and attracting more passengers to TGSRTC services. The corporation has introduced the offer under the concept of “One Booking, Two Journeys, More Savings.”
Passengers need to book both their onward and return journey tickets at the same time to avail themselves of the discount. TGSRTC officials said the 10% concession on the return ticket will be available across its bus services.
The offer is expected to benefit middle-class passengers travelling to distant destinations, particularly those planning trips during festivals and holidays. Booking the return ticket in advance can help passengers save on their overall travel expenses.
TGSRTC is already implementing the Mahalakshmi scheme, under which women can travel free of charge on Palle Velugu and Express buses in Telangana. The new return-ticket discount is aimed at encouraging other passengers, including men and those making reservations, to choose TGSRTC services.