తెలంగాణ రాష్ట్రాన్ని క్రీడా పోటీల్లో అద్భుత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతానని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక ,పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం ప్రారంభం సందర్భంగా 4వ అంతస్తు లో నూతన చాంబర్లో రాష్ట్రంలో సీఎం కప్పు క్రీడల పోటీల నిర్వహణ ఫైల్ పై తొలి సంతకం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి పెద్దపీట వేయడానికి రాష్ట్రవ్యాప్తంగా చీఫ్ మినిస్టర్స్ కప్ ను నిర్వహించాలని అందుకు సంబంధించి 3 కోట్ల 20 లక్షల రూపాయలను విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని క్రీడల హబ్ గా రూపుదిద్దడానికి కృషి చేస్తున్నామని తెలిపారు.