Aliabad Municipality Launches ₹6 Lakh Drainage Project | Telangana News

అలియాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని మున్సిపల్ చైర్‌పర్సన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి తెలిపారు. రూ.6 లక్షలతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులకు ఆమె శ్రీకారం చుట్టారు.
శామీర్‌పేట, ఆగస్టు 6: శామీర్‌పేట మండలం అలియాబాద్ మున్సిపల్ పరిధిలోని 5వ వార్డులో రూ.6 లక్షల మున్సిపల్ జనరల్ నిధులతో చేపట్టనున్న అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులను మున్సిపల్ చైర్‌పర్సన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మున్సిపాలిటీని దశలవారీగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు మున్సిపాలిటీ నిరంతరం కృషి చేస్తుందని, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని కోరారు.
అభివృద్ధి పనులను సమయానికి పూర్తి చేసి ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్య, మౌలిక సదుపాయాలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వైస్ చైర్‌పర్సన్ కన్‌రెడ్డి మాలతి మాధవ రెడ్డి, కౌన్సిలర్లు తల్లా స్వప్న రాంప్రసాద్, తలారి మౌనిక బాబు, కైరా గణేష్, మున్సిపల్ ఏఈఈ సనా షాహీన్, మున్సిపల్ సిబ్బంది, వార్డు ప్రజలు పాల్గొన్నారు.
English
Underground Drainage Works Worth ₹6 Lakh Launched in Aliabad
Aliabad Municipal Chairperson Kantham Sirisha Krishna Reddy said the municipality is committed to strengthening civic infrastructure and ensuring phased development. She inaugurated underground drainage works worth ₹6 lakh in Ward No. 5.
Shamirpet, August 6: Underground drainage works worth ₹6 lakh, funded through municipal general funds, were inaugurated in Ward No. 5 of Aliabad Municipality by Chairperson Kantham Sirisha Krishna Reddy.
Speaking on the occasion, she said the municipality would be developed in a phased manner with a focus on improving civic amenities. She appealed to residents to extend their cooperation in implementing development works.
She added that the municipality is making continuous efforts to provide better infrastructure and sanitation facilities for the benefit of residents.
The programme was attended by Vice Chairperson Kanreddy Malathi Madhav Reddy, councillors Thalla Swapna Ramprasad, Talari Mounika Babu, Kaira Ganesh, Municipal AEE Sana Shaheen, municipal staff and local residents.