English News Headline
CM Revanth Reddy Guides New Yadagirigutta Temple Board on Development and Devotee Facilities
Full Telugu News Article
యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నూతన పాలక మండలి సభ్యులు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీ బోధి పెవిలియన్లో జరిగిన ఈ సమావేశంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు.
ఇటీవల ఏర్పాటు చేసిన నూతన పాలక మండలి సభ్యులు ముఖ్యమంత్రిని కలిసి తమకు బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా దేవస్థానం అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన, ఆలయ నిర్వహణలో పారదర్శకత, సేవల విస్తరణపై చర్చ జరిగింది.
సమావేశంలో యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు చైర్మన్ ఎం. సత్యనారాయణ రెడ్డి, బోర్డు సభ్యులు ఎమ్మెల్యే వినోద్ వెంకటస్వామి, కొణిదెల సురేఖ, విజయ రాజం, పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్, డాక్టర్ మల్లయ్య, స్వాతి కాంతమనేని, ఎం. రాఘవేందర్ రావు, డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ పాల్గొన్నారు.
యాదగిరిగుట్ట క్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేయడంతో పాటు భక్తులకు ఆధునిక సౌకర్యాలు అందించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి నూతన పాలక మండలికి సూచించారు. ఆలయ అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసి రాష్ట్రంలో ఆదర్శ దేవస్థానంగా తీర్చిదిద్దాలని దిశానిర్దేశం చేశారు.
Full English News Article
The newly constituted governing board of the Yadagirigutta Sri Lakshmi Narasimha Swamy Temple met Chief Minister A. Revanth Reddy at the MCR HRD Bodhi Pavilion in Hyderabad. Endowments Minister Konda Surekha also attended the meeting.
The newly appointed board members expressed their gratitude to the Chief Minister for constituting the new governing body. The meeting focused on the overall development of the temple, enhancing facilities for devotees, and strengthening temple administration.
The meeting was attended by Board Chairman M. Satyanarayana Reddy, MLA Vinod Venkataswamy, Konidela Surekha, Vijaya Rajam, Pochaboyina Eswaramma Yadav, Dr. Mallaiah, Swathi Kanthamneni, M. Raghavender Rao, and Dr. Lakshminarayana Naik.
Chief Minister Revanth Reddy instructed the new governing board to prioritize the development of the Yadagirigutta temple and improve amenities for devotees. He emphasized efficient implementation of development initiatives to further strengthen the temple’s reputation as one of Telangana’s major spiritual destinations.