English News Headline
What Happens to Assets Seized by ACB? Here’s How Cash, Gold and Properties Are Handled Under Law

Full Telugu News Article
అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దాడుల్లో తరచూ కోట్లాది రూపాయల నగదు, కిలోల కొద్దీ బంగారం, విలువైన భూములు, ఇళ్లు, బ్యాంకు డిపాజిట్లు వెలుగులోకి వస్తుంటాయి. ఇటీవల తెలంగాణలో పలువురు ఉన్నతాధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో చిక్కుకోవడంతో ప్రజల్లో ఒక ప్రశ్న చర్చనీయాంశంగా మారింది. ఏసీబీ స్వాధీనం చేసుకున్న ఈ ఆస్తులను చివరకు ఏం చేస్తారు? అవి ప్రభుత్వ ఖజానాకు చేరుతాయా? లేక తిరిగి సంబంధిత అధికారులకే అప్పగిస్తారా?
ఏసీబీ అధికారులు సోదాల సమయంలో స్వాధీనం చేసుకున్న నగదు, బంగారం, ఆస్తి పత్రాలు, బ్యాంకు ఖాతాల వివరాలను కోర్టు ముందు సమర్పిస్తారు. అనంతరం ఆయా ఆస్తులకు సంబంధించి చట్టబద్ధమైన ఆదాయ వనరులు ఉన్నాయా అనే అంశాన్ని విచారిస్తారు. సంబంధిత అధికారి సరైన ఆధారాలు సమర్పించలేకపోతే ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి అవినీతి నిరోధక చట్టం కింద ఛార్జ్‌షీట్ దాఖలు చేస్తారు.
కోర్టు విచారణ పూర్తై నిందితుడు దోషిగా తేలిన తర్వాతే అక్రమాస్తులపై తుది చర్యలు ప్రారంభమవుతాయి. నేరం ద్వారా కూడబెట్టిన ఆస్తులుగా కోర్టు నిర్ధారిస్తే ప్రభుత్వం వాటిని స్వాధీనం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇళ్లు, ప్లాట్లు, భూములను ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుని బహిరంగ వేలం నిర్వహించవచ్చు. వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని ప్రభుత్వ ఖాతాలో జమ చేస్తారు.
స్వాధీనం చేసుకున్న నగదును సాధారణంగా ప్రభుత్వ ఖజానాలో భద్రపరుస్తారు. బంగారం, వాహనాలు వంటి ఆస్తులకు విలువ నిర్ధారించి కోర్టు అనుమతితో వేలం వేసే అవకాశం ఉంటుంది. షేర్లు, మ్యూచువల్ ఫండ్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు వంటి ఆర్థిక పెట్టుబడులను కూడా చట్ట ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రభుత్వ ఖాతాలకు బదిలీ చేయవచ్చు.
అయితే రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు ఏసీబీ కేసుల్లో స్వాధీనం చేసుకున్న భారీ అక్రమాస్తులను బహిరంగ వేలం ద్వారా విక్రయించిన ఘటనలు చాలా అరుదుగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. కేసులు కోర్టుల్లో సంవత్సరాల పాటు కొనసాగడం, అప్పీలు, న్యాయపరమైన ప్రక్రియలు పూర్తవడానికి ఎక్కువ సమయం పట్టడం ఇందుకు ప్రధాన కారణాలుగా పేర్కొంటున్నారు.
ఇటీవలి కాలంలో తెలంగాణలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో పలువురు ఉన్నతాధికారులు అరెస్టవడం, వందల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు బయటపడడం చర్చనీయాంశంగా మారింది. ఈ కేసుల్లో నిందితులు దోషులుగా తేలితే ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.
Full English News Article
Large amounts of cash, gold, land, houses, bank deposits and other valuable assets are frequently uncovered during Anti-Corruption Bureau (ACB) raids. With several senior officials in Telangana recently facing disproportionate assets cases, a common public question has emerged: What happens to the assets seized by the ACB?
During raids, the ACB seizes cash, gold, property documents, bank account details and other suspected assets and presents them before the court. Authorities then seek explanations regarding the legitimate sources of income used to acquire those assets. If the accused fails to provide satisfactory evidence, a disproportionate assets case is registered under the Prevention of Corruption Act.
Final action on the assets begins only after the court completes the trial and the accused is convicted. If the court determines that the assets were acquired through corrupt means, they may be confiscated by the government. Immovable properties such as houses, plots and land can be taken over and sold through public auction, with the proceeds deposited into government accounts.
Cash seized during raids is generally deposited in government custody. Gold, vehicles and other valuables may be valued and auctioned with court approval. Financial investments such as shares, mutual funds and fixed deposits can also be transferred to government accounts after completion of legal proceedings.
Officials note that large-scale auctions of ACB-seized assets have been relatively rare due to lengthy court proceedings, appeals and legal challenges. However, with several recent high-profile disproportionate assets cases involving senior officials, successful convictions could potentially generate significant revenue for the government while also serving as a deterrent against corruption.