విజయ్ ప్రభుత్వ యత్నానికి గవర్నర్ బ్రేక్

English News Headline

Tamil Nadu Governor Rejects Vijay TVK Government Formation Bid Over Majority Mark

Full Telugu News Article

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీవీకే అధినేత విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు చేసిన ప్రయత్నాలకు మరోసారి నిరాశ ఎదురైంది. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ గురువారం చెన్నైలోని లోక్ భవన్‌లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌ను విజయ్ మరోసారి కలిశారు.

ఈ సందర్భంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని విజయ్ గవర్నర్‌ను కోరినట్లు సమాచారం. అయితే స్పష్టమైన సంఖ్యాబలం లేకుండా ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి ఇవ్వలేమని గవర్నర్ స్పష్టం చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అసెంబ్లీలో మెజార్టీని నిరూపించేందుకు అవకాశం ఇవ్వాలని విజయ్ విజ్ఞప్తి చేసినప్పటికీ, ముందుగా 118 మంది ఎమ్మెల్యేల మద్దతు జాబితాను సమర్పించాలని గవర్నర్ సూచించినట్లు తెలుస్తోంది.

తమిళనాడు అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118. ఎన్నికల్లో టీవీకే పార్టీ 108 స్థానాలు సాధించినప్పటికీ, విజయ్ రెండు స్థానాల్లో పోటీ చేయడంతో ఒక్క స్థానమే పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. దీంతో పార్టీ బలం 107కి చేరినట్లు లెక్కలు చెబుతున్నాయి.

ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు లభించినట్లు సమాచారం. అలాగే వీసీకే, సీపీఐ వంటి పార్టీల మద్దతు కూడా లభించే అవకాశాలపై చర్చ జరుగుతోంది. అయినప్పటికీ అధికారికంగా మెజార్టీ నిరూపించే సంఖ్యా బలం లేకపోవడంతో గవర్నర్ ప్రభుత్వం ఏర్పాటు కోసం ఆహ్వానించలేమని తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది.

గవర్నర్ వైఖరిపై విజయ్, టీవీకే నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించే అంశంపై పార్టీ న్యాయ నిపుణులతో చర్చలు జరుగుతున్నట్లు తమిళ రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

Full English News Article

A major political development unfolded in Tamil Nadu after TVK chief Vijay reportedly failed once again to secure the Governor’s approval for forming the government. Vijay met Tamil Nadu Governor Rajendra Vishwanath Arlekar at Lok Bhavan in Chennai on Thursday seeking permission to stake claim to form the government.

According to political sources, Vijay requested the Governor to allow the TVK party to prove its strength on the Assembly floor. However, the Governor is believed to have clarified that government formation cannot be permitted without clear majority support.

Sources indicate that the Governor insisted on the submission of support letters from at least 118 MLAs before inviting any party to form the government. The required majority mark in the Tamil Nadu Assembly currently stands at 118.

Though TVK emerged as one of the largest parties in the election with 108 seats, Vijay contested from two constituencies and may be counted from only one seat, effectively bringing the party’s strength down to 107 MLAs.

Political discussions intensified after reports emerged that Congress extended support through five MLAs. There are also indications that parties like VCK and CPI may support the TVK-led government. Despite these developments, the Governor reportedly maintained that numerical majority must be formally established before any invitation for government formation can be considered.

Following the latest meeting, dissatisfaction is said to be growing within TVK leadership circles. Tamil Nadu political observers suggest that Vijay may approach the Supreme Court seeking legal intervention over the Governor’s refusal.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *