జగన్‌ ప్రభుత్వంపై ఇప్పుడిప్పుడే తాను విమర్శలు చేయబోను… మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ సంచలన వ్యాఖ్యలు



జగన్‌ ప్రభుత్వంపై ఇప్పుడిప్పుడే తాను విమర్శలు చేయబోనని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎందుకు విమర్శలు చేయవని అడిగేవారికి ఆ అర్హత లేదన్నారు. రామోజీ రావు ఆగ్రహిస్తే ఏదో జరిగిపోతుందనే రోజులు పోయాయన్నారు. రామోజీరావు మార్గదర్శి అక్రమాలు`నిజానిజాలు అనే అంశంపై విజయవాడలో స్వర్ణాంధ్ర పత్రిక ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. ఇందులో పాల్గొన్న ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.ఈనాడు పత్రికలో వ్యతిరేకంగా రాస్తే ఏదో జరిగిపోయే రోజులు పోయాయన్నారు. గతంలో రాజమండ్రిలో ఎంపీగా పోటీ చేసినప్పుడు తనను ఓడిరచేందుకు రామోజీరావు ఎంతో ప్రయత్నించినా తాను గెలిచానని గుర్తు చేశారు. ఇప్పుడు జగన్‌ ప్రభుత్వం పట్ల కూడా ఈనాడు పత్రిక అలాగే వ్యవహరిస్తోందని మండిపడ్డారు.రామోజీరావు తాను చట్టాలను పట్టించుకోనంటారని.. చట్టాలకు అతీతమన్నట్లుగా వ్యవహరిస్తారని ఉండవల్లి నిప్పులు చెరిగారు. తనను ఎవరూ ప్రశ్నించడానికి వీల్లేదని రామోజీరావు వాదిస్తారని తప్పుబట్టారు. తాను ఆర్థిక అక్రమాలకు పాల్పడినా ఎవరూ అడగకూడదనే వితండవాదం రామోజీదన్నారు. గత 60 ఏళ్లుగా తన అక్రమాలను ఎవరూ ప్రశ్నించలేదు కాబట్టి ఇప్పుడూ అడగడానికి వీల్లేదని రామోజీరావు భావిస్తున్నారని ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.రామోజీరావు లాంటి వారిని వదిలేస్తే దేశంలో అతిపెద్ద మాఫియా సామ్రాజ్యం తయారవుతుంది అని ఉండవల్లి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ విషయంలోనూ 2006లో రామోజీరావు అడ్డగోలుగా వాదించారని ఉండవల్లి గుర్తు చేశారు. హిందూ అవిభక్త కుటుంబం (హెచ్యూఎఫ్‌) కాబట్టి ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేయవచ్చన్న రామోజీరావు వాదనను ఆర్బీఐ తిరస్కరించిందని గుర్తు చేశారు. ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేయకూడదని ఆర్బీఐ రామోజీరావుకు స్పష్టం చేసిందన్నారు.రామోజీరావు సైతం ప్రజల నుంచి రూ.2600 కోట్లు డిపా­జిట్లు సేకరించడం తప్పని ఆర్బీఐ వద్ద అంగీకరించారని గుర్తు చేశారు. ఆ డిపాజిట్లను వెనక్కి ఇచ్చేస్తున్నట్లు లిఖితపూర్వకంగా పేర్కొన్నారని వివరించారు. కానీ ఎవరెవరి నుంచి డిపాజిట్లు వసూలు చేశారో చెప్ప­మంటే మాత్రం చెప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ డిపాజిట్దారుల వివరాలు తెలియచేయాలని ఇటీవలే సుప్రీం కోర్టు ఆదేశించిందని గుర్తు చేశారు.అదేవిధంగా మార్గదర్శి చిట్ఫండ్స్‌ ను నిర్వహిస్తున్న రామోజీరావు అసలు తాను కేంద్ర చిట్‌ ఫండ్‌ చట్టాన్ని పట్టించుకోనని సీఐడీ విచారణలో వాదించడం బరితెగింపు అని ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ ధ్వజమెత్తారు. చిట్‌ ఫండ్‌ సంస్థలు తమ చందాదారుల నుంచి వసూలు చేసే సొమ్మును జాతీయ బ్యాంకులో డిపాజిట్‌ చేయాలని చట్టంలో ఉందని గుర్తు చేశారు. కానీ ఆ నిధులను రామోజీరావు తన సొంత సంస్థల్లో పెట్టుబడిగా పెట్టారని ఆరోపించారు.మార్గదర్శి చిట్ఫండ్స్‌ అక్రమాలపై రామోజీరావు ఆయన కోడలిని విచారించేందుకు సీఐడీ అధికారులు వారి ఇంటికే వెళ్లాల్సి వచ్చిందని ఉండవల్లి అరుణ్‌ గుర్తు చేశారు. దేశంలో ఇతరులకు అలా సాధ్యం అవుతుందా? అని నిలదీశారు. రామోజీరావు కాబట్టి ఏదైనా చెల్లుతుందన్నారు.మార్గదర్శి చిట్‌ ఫండ్స్లో అక్రమాలను తాను ప్రశ్నిస్తే రామోజీపై కక్ష గట్టానని కొందరు ఆడిటర్లు న్యాయవాదులు వాదిస్తుండటం విడ్డూరమన్నారు. రామోజీరావుకు మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ కు అసలు సంబంధం లేదంటూ రాజాజీ అనే వ్యక్తితో నాపై పరువునష్టం దావా వేయించారని గుర్తు చేశారు. అప్పుడు ఈ ఆడిటర్లు న్యాయవాదులు ఒక్కరైనా మాట్లాడారా? అని నిలదీశారు.తాను వేసిన పిటిషన్‌ లో ఎక్కడ కేసీఆర్‌ ప్రభుత్వం ఇంప్లీడ్‌ అవుతుందో అనే భయంతో రామోజీ ఈనాడులో టీఆర్‌ఎస్‌ కు భజన చేస్తు­న్నారని ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ ప్రభుత్వం సచివాలయాన్ని నిర్మిస్తే మయసభ నిర్మించినట్టుగా పెద్ద పెద్ద వార్తలు వేసి కేసీఆర్‌ ను ఖుషీ చేయడానికి రామోజీ ప్రయత్నించారని విమర్శించారు.
చంద్రబాబు మార్గదర్శి వ్యవహారాలపై చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని ఉండవల్లి తెలిపారు. సింగ పూర్‌ దుబాయిలో చంద్రబాబుకు ఉన్న ఆస్తులు లాంటి వంటి కష్టమైన ప్రశ్నలు ఏవీ తాను అడగనన్నారు. టీడీపీ ప్రభుత్వంలో వ్యవహారాలపైనే అడుగుతానని వెల్లడిరచారు. పోలవరం ప్రాజెక్ట్ను తామే కడతామని చంద్రబాబు ప్రభుత్వం అడిగి తీసుకుందా? లేక విూరే కట్టమని కేంద్రమే ఇచ్చిందా? దానికి సమాధానం చెబితే చాలన్నారు.
RRRRRRRRRRRRRRRRRRRRRRRచీచీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *