విక్రమ్-1తో తెలంగాణ చరిత్ర

English News Headline

Skyroot Vikram-1: India’s First Private Orbital Rocket Flagged Off in Hyderabad by CM Revanth Reddy

Full Telugu News Article

హైదరాబాద్ అంతరిక్ష రంగంలో మరో చారిత్రాత్మక ఘట్టానికి వేదికైంది. దేశంలోనే తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్‌గా గుర్తింపు పొందిన విక్రమ్-1 రాకెట్‌ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శనివారం జెండా ఊపి ప్రారంభించారు.

హైదరాబాద్ మామిడిపల్లిలోని జీఎంఆర్ ఏరోస్పేస్ ఇండస్ట్రియల్ పార్క్‌లో ఉన్న మాక్స్-క్యూ డిజైన్ ఫెసిలిటీలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. హైదరాబాద్‌కు చెందిన ఏరోస్పేస్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ ఈ ప్రతిష్టాత్మక రాకెట్‌ను పూర్తిగా అభివృద్ధి చేసింది.

దేశంలో ప్రైవేట్ రంగంలో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసిన తొలి ఆర్బిటల్ రాకెట్ కావడం విక్రమ్-1 ప్రత్యేకత. జెండా ఊపిన అనంతరం ఈ రాకెట్‌ను శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రానికి ప్రయోగం కోసం తరలించారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఏరోస్పేస్ రంగంలో తెలంగాణను ప్రపంచ అగ్రగామిగా నిలపడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. 2047 నాటికి ఈ రంగంలో ప్రపంచస్థాయి నాయకత్వం సాధించాలని రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

బోయింగ్, ఎయిర్‌బస్ వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు ఇప్పటికే తెలంగాణలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని, ఇప్పుడు స్కైరూట్ వంటి స్టార్టప్‌లు రాష్ట్ర ఖ్యాతిని మరింత పెంచుతున్నాయని సీఎం పేర్కొన్నారు.

2022లో తొలి రాకెట్ ప్రయోగం చేసిన స్కైరూట్ అతి తక్కువ కాలంలోనే ఆర్బిటల్ దశకు చేరుకోవడం విశేషమని ఆయన అభినందించారు. పూర్తిగా హైదరాబాద్‌లోనే డిజైన్ చేసి అభివృద్ధి చేసిన ఈ రాకెట్ తెలంగాణ సాంకేతిక సామర్థ్యానికి నిదర్శనమని అన్నారు.

ఇంజనీరింగ్ ఎగుమతుల్లో తెలంగాణ గత ఏడాది 117.9 శాతం వృద్ధి నమోదు చేసిందని, ఇందులో విమాన విడిభాగాలు, రక్షణ పరికరాల పాత్ర కీలకమని సీఎం తెలిపారు.

యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా అంతరిక్ష సాంకేతికతలో యువతకు శిక్షణ అందించేందుకు స్కైరూట్ ప్రభుత్వంతో భాగస్వామ్యం చేసేందుకు ముందుకు వచ్చిందని వెల్లడించారు.

స్కైరూట్ సీఈఓ పవన్ కుమార్ చందన మాట్లాడుతూ, ఏరోస్పేస్ రంగంలో నైపుణ్యం కలిగిన సిబ్బంది కొరతను తీర్చేందుకు ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

విక్రమ్-1 రాకెట్ బహుళ ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపే సామర్థ్యంతో పాటు తేలికైన, దృఢమైన కార్బన్ ఫైబర్ నిర్మాణంతో రూపొందించబడిందని అధికారులు తెలిపారు.

Full English News Article

Hyderabad witnessed a major milestone in India’s space sector as Chief Minister A. Revanth Reddy flagged off Vikram-1, the country’s first privately developed orbital rocket, on Saturday.

The launch ceremony was held at the Max-Q Design Facility located in GMR Aerospace Industrial Park, Mamidipally, Hyderabad. The prestigious orbital rocket has been developed by Hyderabad-based aerospace startup Skyroot Aerospace.

Vikram-1 is significant because it is India’s first fully developed private-sector orbital rocket. After the formal flag-off, the rocket was moved to the Satish Dhawan Space Centre in Sriharikota for its upcoming launch mission.

Speaking on the occasion, CM Revanth Reddy said the Telangana government aims to make the state a global leader in the aerospace sector by 2047. He said Telangana is already emerging as a major aerospace hub in India.

The Chief Minister noted that global giants like Boeing and Airbus are already operating in the state, and startups like Skyroot Aerospace are further strengthening Telangana’s global reputation in advanced technology sectors.

He praised the Skyroot team for reaching the orbital stage in a short time after launching its first rocket in 2022. He said developing a full orbital rocket entirely in Hyderabad is a remarkable achievement for Telangana.

The CM also highlighted that Telangana recorded 117.9 percent growth in engineering exports last year, with aircraft components and defence equipment playing a major role in that performance.

He announced that Skyroot will collaborate with the Young India Skills University to provide training to youth in space technology and advanced aerospace skills.

Skyroot CEO Pawan Kumar Chandana said the company is interested in partnering with the Skills University and helping address the shortage of skilled professionals in the aerospace industry.

Officials said Vikram-1 is designed with a lightweight yet strong carbon fiber structure and has the capability to place multiple satellites into orbit.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *