వడదెబ్బ జాగ్రత్తలు తెలుసుకోండి | Heat Stroke Symptoms & Prevention Tips

వడదెబ్బ ప్రమాదకర స్థితి కావడంతో లక్షణాలు గుర్తించి వెంటనే చికిత్స అవసరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Doctors warn that heat stroke is a dangerous condition and requires immediate attention upon identifying symptoms.

ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో వడదెబ్బ (హీట్ స్ట్రోక్) కేసులు పెరిగే అవకాశముందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అధిక ఉష్ణోగ్రతల్లో ఎక్కువసేపు ఉండటం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గి, అంతర్గత ఉష్ణోగ్రత అధికంగా పెరగడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. సమయానికి చికిత్స అందకపోతే ఇది ప్రాణాంతకంగా మారి మెదడు, ఇతర అంతర్గత అవయవాలకు నష్టం కలిగించే ప్రమాదం ఉంది.

వైద్య నిపుణుల ప్రకారం, వడదెబ్బ తగిలినప్పుడు శరీర ఉష్ణోగ్రత 40°C కంటే ఎక్కువగా పెరుగుతుంది. తలనొప్పి, వికారం, వాంతులు, గందరగోళం, హార్ట్‌బీట్ పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పరిస్థితి విషమిస్తే ఫిట్స్, స్పృహ కోల్పోవడం వంటి తీవ్రమైన సమస్యలు తలెత్తవచ్చు. సాధారణంగా ఎండలో చెమట పడుతుండగా, వడదెబ్బ సమయంలో చెమట ఆగిపోవడం, చర్మం పొడిగా మారి ఎర్రగా కనిపించడం ముఖ్య లక్షణంగా పేర్కొంటున్నారు.

వడదెబ్బ నివారణలో భాగంగా శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం అత్యంత అవసరం. దాహం వేయకపోయినా తరచుగా నీళ్లు తాగడం, పండ్లరసాలు, మజ్జిగ వంటి ద్రవాలు తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల మధ్యలో ఎండలో తిరగకుండా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని నిపుణులు సూచిస్తున్నారు.

వేసవిలో తేలికపాటి, వదులుగా ఉండే పత్తి లేదా లినెన్ దుస్తులు ధరించడం మంచిది. లేత రంగుల దుస్తులు వేడి తగ్గించడంలో సహాయపడతాయి. బయటకు వెళ్లేటప్పుడు టోపీ, స్కార్ఫ్, సన్‌గ్లాస్, గొడుగు వంటి రక్షణ చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. టీ, కాఫీ వంటి కెఫిన్ పానీయాలు తగ్గించడంతో పాటు మద్యం పూర్తిగా నివారించాలని చెబుతున్నారు. అలాగే అధిక కారం, మసాలాలు, చక్కెరలు ఉన్న ఆహారం తగ్గించి తేలికపాటి, నీటి శాతం ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.

వడదెబ్బ అనుమానం ఉన్న వ్యక్తికి వెంటనే చల్లని ప్రదేశానికి తరలించి ప్రాథమిక చికిత్స అందించాలి. ఆలస్యం చేయకుండా సమీప ఆసుపత్రికి తరలించడం అవసరం అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Doctors say that rising temperatures increase the risk of heat stroke, a serious medical emergency caused by prolonged exposure to high heat. It occurs when the body loses fluids and fails to regulate its temperature, leading to a dangerous rise in internal heat. Without timely treatment, it can damage the brain and other vital organs.

According to medical experts, body temperature may exceed 40°C during heat stroke. Symptoms include severe headache, nausea, vomiting, confusion, and increased heart rate. In severe cases, it may lead to seizures and loss of consciousness. Unlike normal heat exposure, sweating may stop, and the skin can become dry, hot, and reddish.

Preventive measures include staying well-hydrated by drinking water regularly, even without thirst, and consuming fluids like fruit juices and buttermilk. Avoid going out in the sun between 12 PM and 4 PM unless necessary.

Wearing loose, light-colored cotton or linen clothes helps reduce heat absorption. Using protective items like hats, scarves, sunglasses, and umbrellas is advised. Experts recommend limiting caffeine intake and avoiding alcohol. Light, water-rich foods should be preferred over spicy and heavy meals.

If heat stroke is suspected, the person should be moved to a cool place immediately and given first aid. Immediate medical attention is crucial to prevent complications.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *