Annadanam at Shamirpet Temple

శామీర్‌పేటలోని శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. | Free meal (annadanam) was distributed to devotees after special prayers at Sri Renuka Ellamma Temple in Shamirpet.
శామీర్‌పేట, మార్చి 17: మండల కేంద్రంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో మంగళవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఘనంగా అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు పెద్ద ఎత్తున అన్నదానం నిర్వహించడం విశేషంగా నిలిచింది.
ఈ కార్యక్రమంలో శామీర్‌పేటకు చెందిన యాస్కి శ్రీనివాస్ గౌడ్–విజయలక్ష్మి దంపతులు, యాస్కి రఘురామ్ గౌడ్, యాస్కి వంశీకృష్ణ గౌడ్ అన్నదానాన్ని నిర్వహించారు. అలాగే కీ.శే. బత్తిని ఈశ్వర్ గౌడ్ కుటుంబ సభ్యులు, అలియాబాద్‌కు చెందిన వియ్యాల లలిత మరియు ఆమె కుమారుడు వియ్యాల జగదీష్, డిజి వెంకటేష్ గౌడ్ కుటుంబ సభ్యులు, కొల్తూరుకు చెందిన సత్యనారాయణ గౌడ్ ఈ కార్యక్రమానికి సహకరించారు.

ఇక మురుగన్, తులసి, సిద్ధార్థలు 25 కిలోల బియ్యాన్ని అందజేసి సేవ కార్యక్రమానికి తోడ్పడ్డారు. ఆలయానికి విచ్చేసిన భక్తులతో పాటు మాజీ ప్రజా ప్రతినిధులు, రాజీవ్ రహదారి మార్గంగా ప్రయాణించే వారు అన్నప్రసాదాన్ని స్వీకరించారు.
On Tuesday, special rituals were performed at Sri Renuka Ellamma Temple in Shamirpet, followed by a large-scale annadanam for devotees. The initiative saw participation from several local families and donors who contributed food and essential supplies. Devotees visiting the temple, former public representatives, and travelers on the Rajiv Highway partook in the prasadam distribution