its distributed to Class 10 students at Zilla Parishad High School in Ponnala of Shamirpet mandal to support students appearing for board examinations.


మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా, శామీర్‌పేట్, మార్చి 12: మూడు చింతలపల్లి మున్సిపల్ పరిధిలోని పొన్నాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు 12వ వార్డ్ కౌన్సిలర్ మ్యాడబోయిన మౌనిక శివ వీర ప్రసాద్ పరీక్ష కిట్లను పంపిణీ చేశారు.
విద్యార్థులకు పరీక్షల కోసం అవసరమైన ప్యాడ్లు, జామెట్రీ బాక్సులు, పెన్నులు, స్కేల్స్, వాటర్ బాటిల్స్ అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యసాధన కోసం క్రమశిక్షణతో చదివి మంచి ఫలితాలు సాధించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, పాఠశాల చైర్మన్ అజయలక్ష్మి, కౌన్సిలర్ కొలాసు రాజు, నాయకులు సతీష్ రెడ్డి, పిట్టల రమేష్, శివ శంకర్, తలారి క్రిష్ణ, మైనబోయిన పాపయ్య, మైనబోయిన బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.