Medical camp conducted for students at Telangana Minority Gurukul School in Jagamguda area of Shamirpet mandal to promote student health awareness.

మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా, శామీర్‌పేట్, మార్చి 12: మూడు చింతలపల్లి మున్సిపల్ పరిధిలోని జగ్గంగూడలో ఉన్న తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాలలో విద్యార్థుల కోసం ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. మేడ్చల్ జిల్లా ఆర్బీఎస్కే ఎంహెచ్టిబీ బృందం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
డాక్టర్ శ్రవణ్ కుమార్, డాక్టర్ మౌనిక, ఫార్మాసిస్ట్ పవిత్ర, ఏఎన్ఎమ్ తులసి విద్యార్థులకు సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్య సూచనలు అందించారు. జ్వరం, దగ్గు, జలుబు వంటి సాధారణ ఆరోగ్య సమస్యలను పరిశీలించి తగిన జాగ్రత్తలు సూచించారు.
అలాగే అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడే సీపీఆర్ విధానం గురించి అవగాహన కల్పించారు. పరీక్షల సమయంలో ఒత్తిడిని నియంత్రించుకోవడం, వ్యక్తిగత పరిశుభ్రత, పోషకాహారం ప్రాముఖ్యత, అనీమియా నివారణ వంటి అంశాలపై విద్యార్థులకు వివరించారు.
అత్యవసర వైద్య సహాయం కోసం 14416 హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ క్రిష్ణ, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.