ఇరాన్–ఇజ్రాయెల్ ఉద్రిక్తతల కారణంగా చమురు రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధిలో అంతరాయం ఏర్పడే అవకాశాలు పెరుగుతున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. పరిస్థితులు కొనసాగితే భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Tensions linked to Iran–Israel developments are raising concerns over disruptions in the Strait of Hormuz, a key global oil shipping route. Rising crude oil prices may impact fuel costs in India if the situation continues, experts warn.

ఇరాన్–ఇజ్రాయెల్ ఉద్రిక్తతల కారణంగా చమురు రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధిలో అంతరాయం ఏర్పడే అవకాశాలు పెరుగుతున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. పరిస్థితులు కొనసాగితే భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Tensions linked to Iran–Israel developments are raising concerns over disruptions in the Strait of Hormuz, a key global oil shipping route. Rising crude oil prices may impact fuel costs in India if the situation continues, experts warn.

న్యూఢిల్లీ, మార్చి 5 (న్యూస్ పల్స్): అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై దాడులు జరిపుతున్న నేపథ్యంలో ప్రతిగా ఇరాన్ గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా స్థావరాలపై క్షిపణి దాడులు చేస్తోంది. ఈ పరిణామాలతో చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిలో రవాణా అంతరాయం ఏర్పడే అవకాశాలు పెరిగాయి. ఈ పరిస్థితి కొనసాగితే ప్రపంచ దేశాలతో పాటు భారత్‌పై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

ముడి చమురు ధరలు ఇప్పటికే పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అమెరికా వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) క్రూడ్ ధర 3.19 శాతం పెరిగి బ్యారెల్‌కు 67.29 డాలర్లకు చేరింది. బ్రెంట్ క్రూడ్ ధర 72.87 డాలర్ల వద్ద నమోదైంది. పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారితే బ్యారెల్ ధర 100 డాలర్లకు చేరవచ్చని బార్‌క్లేస్ బ్యాంక్ అంచనా వేసింది.

ఈ స్థాయికి చమురు ధరలు చేరితే భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు సుమారు రూ.10 వరకు పెరగవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం భారతదేశం తన ముడి చమురు అవసరాల్లో సుమారు 88 శాతం దిగుమతుల ద్వారానే తీర్చుకుంటోంది. దేశంలో రోజుకు సుమారు 5.5 మిలియన్ బ్యారెళ్ల చమురు వినియోగం జరుగుతుండగా అందులో రెండు మిలియన్ బ్యారెళ్లు హార్ముజ్ జలసంధి మార్గం ద్వారా వస్తున్నాయి.

క్రూడ్ ధర ఒక్క డాలర్ పెరిగినా భారత ప్రభుత్వంపై ఏటా సుమారు రూ.13 వేల కోట్ల అదనపు భారం పడుతుందని అంచనా. గత ఏడాది భారత్ దాదాపు 160 బిలియన్ డాలర్ల విలువైన ముడి చమురును దిగుమతి చేసుకుంది.

ఇంధన ధరలు పెరిగితే ద్రవ్యోల్బణం పెరగడంతో పాటు కరెంట్ అకౌంట్ లోటు కూడా పెరిగే ప్రమాదం ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం దేశంలో సుమారు 76 రోజులకు సరిపడా ముడి చమురు నిల్వలు ఉన్నాయని ప్రకటించింది.

ప్రస్తుతం బ్రెంట్ చమురు ధర బ్యారెల్‌కు 77 డాలర్లకు చేరువలో ఉన్నప్పటికీ సమీప కాలంలో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగకపోవచ్చని విశ్వసనీయ వర్గాలు సూచిస్తున్నాయి. కానీ ఇరాన్–ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు దీర్ఘకాలం కొనసాగి హార్ముజ్ జలసంధిలో రవాణా పూర్తిగా నిలిచిపోయే పరిస్థితి వస్తే భారత్‌లో ఇంధన ధరలు గణనీయంగా పెరిగే అవకాశముందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

యుద్ధ ప్రభావం కేవలం ఇంధన రంగానికే పరిమితం కాకపోవచ్చు. వంటనూనెల దిగుమతులపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. భారత్ ప్రతి సంవత్సరం సుమారు 16 మిలియన్ టన్నుల వంటనూనెలను దిగుమతి చేసుకుంటుంది. ఇందులో పొద్దుతిరుగుడు నూనె వాటా దాదాపు 20 శాతం. ఈ నూనెలు ప్రధానంగా రష్యా, ఉక్రెయిన్, అర్జెంటీనా దేశాల నుంచి దిగుమతి అవుతున్నాయి.

ఇక ఎరువుల రంగంపైనా ప్రభావం పడే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందు డీఏపీ, ఎస్ఎస్పీ ఎరువుల తయారీలో ఉపయోగించే సల్ఫర్, సల్ఫ్యూరిక్ యాసిడ్ సరఫరాపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. భారత సల్ఫర్ దిగుమతుల్లో ఖతార్, యూఏఈ, ఒమాన్ దేశాల వాటా దాదాపు 76 శాతం ఉంది.

New Delhi, March 5 (News Pulse): Rising tensions in West Asia following attacks involving Iran and Israel are raising concerns over possible disruptions to global oil transport routes. The Strait of Hormuz, one of the world’s most crucial oil shipping lanes, could face disruptions if the conflict escalates further. Such developments may impact global oil prices and eventually affect fuel costs in India.

Crude oil prices have already begun showing an upward trend. US West Texas Intermediate (WTI) crude rose by 3.19 percent to $67.29 per barrel, while Brent crude reached $72.87 per barrel. According to estimates by Barclays Bank, prices could climb to $100 per barrel if tensions continue.

If crude reaches that level, petrol and diesel prices in India could rise by nearly ₹10 per litre, experts estimate. India currently meets around 88 percent of its crude oil demand through imports. The country consumes nearly 5.5 million barrels of oil per day, of which nearly two million barrels pass through the Strait of Hormuz.

A $1 increase in crude oil prices could add an annual burden of nearly ₹13,000 crore on the government. Last year, India imported crude oil worth about $160 billion.

Higher fuel prices may push inflation upward and widen

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *