తెలంగాణలో మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజులపాటు ‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’ను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి Revanth Reddy జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

The Chief Minister directed district collectors to ensure effective ground-level execution of the 99-day Praja Palana–Pragathi Pranalika programme across Telangana.

Image

తెలంగాణలో మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజులపాటు ‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’ను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి Revanth Reddy జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. The Chief Minister directed district collectors to ensure effective ground-level execution of the 99-day Praja Palana–Pragathi Pranalika programme across Telangana.

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి ఈ దిశానిర్దేశం చేశారు. ఈ మూడు నెలలు ప్రతి కలెక్టర్ పనితీరుకు కొలమానమని, వారి సేవా ప్రస్థానానికి పునాదిగా నిలుస్తాయని పేర్కొన్నారు. ప్రభుత్వం మరియు ప్రజల మధ్య వారధిగా కలెక్టర్లు పని చేయాలని స్పష్టం చేశారు.

Collectors must act as the eyes and ears of the government, he said, stressing that without regular field visits, public grievances cannot be understood. He instructed collectors to spend at least 10 days every month in field inspections and closely monitor welfare implementation.

కలెక్టర్ల పనితీరును నిరంతరం సమీక్షించి నివేదిక అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశించారు. పనితీరు ఆధారంగా వార్షిక నివేదికల్లో బేరీజు వేస్తామని, వచ్చే జూన్‌లో మరోసారి సమీక్ష సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. సమర్థవంతమైన క్షేత్రస్థాయి పనితీరే నిజమైన పరిపాలన ప్రమాణమని స్పష్టం చేశారు.

గ్రామ సర్పంచులు, మేయర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల సమన్వయంతో 99 రోజుల ప్రణాళిక అమలు చేయాలని సూచించారు. కొత్త ప్రజా ప్రతినిధులకు మార్చి 12న జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. శాఖల వారీగా 10 వారాల ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని, ప్రతి జిల్లాకు సీనియర్ ఐఏఎస్ అధికారిని నోడల్ అధికారిగా నియమించాలని ఆదేశించారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని సూచించారు.

Details of beneficiaries under new ration cards, fine rice distribution, Indiramma houses, free electricity up to 200 units, loan waivers, free bus travel for women and ₹500 gas cylinder scheme must be disclosed in village and ward meetings. The government also mandated facial recognition verification for all welfare beneficiaries to prevent misuse.

ఆసరా పింఛన్లలో ఫేషియల్ రికగ్నిషన్ అమలు చేయడంతో మూడు లక్షల అనర్హుల పేర్లు తొలగించామని తెలిపారు. అర్హులకు మాత్రమే లబ్ధి అందేలా సాంకేతికతను సమర్థంగా వినియోగించాలని సూచించారు.

విద్యా రంగంలో జూన్ 12న పాఠశాలల పునఃప్రారంభ దినాన అన్ని విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫార్ములు అందించాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని పర్యవేక్షించేందుకు ప్రతి పాఠశాలకు ఒక అధికారిని నియమించాలని, కలెక్టర్లు వారానికి ఒకసారి పాఠశాలలో భోజనం చేయాలని సూచించారు.

Frequent visits to government hospitals were mandated to prevent lapses. The government spends nearly ₹2,500 crore annually on CM Relief Fund and Aarogyasri schemes. Plans are underway to link all government hospitals with medical colleges to strengthen public healthcare.

మిల్లర్ల వద్ద నిల్వ ఉన్న ధాన్యాన్ని తిరిగి రాబట్టాలని, మోసాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. ఇసుక మాఫియా, అక్రమ మైనింగ్‌పై నిర్లక్ష్యం వహిస్తే కలెక్టర్లు, ఎస్పీలపై కూడా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. అవుట్ సోర్సింగ్‌లో బోగస్ ఉద్యోగులపై ఆడిట్ నిర్వహించి కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.

భూభారతి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి. రీజనల్ రింగ్ రోడ్, ఫ్యూచర్ సిటీ, మామునూర్, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ వంటి ప్రాజెక్టుల భూసేకరణ వేగవంతం చేయాలని సూచించారు. #TelanganaRising విజన్ అమలులో జిల్లా యంత్రాంగం నూటికి నూరు శాతం భాగస్వామ్యం వహించాలని పిలుపునిచ్చా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *