. In view of the tense situation in West Asian countries, Chief Minister Revanth Reddy advised Telugus staying there to remain alert and strictly follow embassy guidelines.

పశ్చిమాసియా దేశాల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడ ఉన్న తెలుగు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, దౌత్య కార్యాలయాల మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. In view of the tense situation in West Asian countries, Chief Minister Revanth Reddy advised Telugus staying there to remain alert and strictly follow embassy guidelines.
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం, పలు దేశాల విమానాశ్రయాల మూసివేతల కారణంగా ముఖ్యంగా ఇరాన్, దుబాయ్ తదితర ప్రాంతాల్లో ఉన్న తెలుగు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ముఖ్యమంత్రి Revanth Reddy పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లోని భారత దౌత్య కార్యాలయాలు జారీ చేస్తున్న సూచనలు, హెచ్చరికలను తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాలని సూచించారు.
The Chief Minister stated that due to the prevailing war-like situation in West Asia and the closure of airports in several countries, Telugus particularly in Iran, Dubai and nearby regions must exercise caution and follow advisories issued by Indian embassies.
తెలంగాణ ప్రజల భద్రత రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని ఆయన స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంతో నిరంతర సమన్వయం కొనసాగించాలని రాష్ట్ర అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
He emphasized that the safety of Telangana people remains the top priority of the State Government and directed officials to maintain continuous coordination with the Central Government regarding the evolving situation.
గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న భారతీయుల రక్షణ కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. విదేశాల్లో ఉన్న భారతీయుల భద్రత, తరలింపు చర్యలపై దౌత్య కార్యాలయాల ద్వారా నిరంతరం అంచనా వేస్తూ తగిన చర్యలు చేపట్టాలని కేంద్ర విదేశాంగ శాఖను విజ్ఞప్తి చేశారు.
He also appealed to the Union Government to take all necessary measures to ensure the safety of Indians stranded in Gulf countries and to continuously assess the situation through diplomatic channels for possible evacuation measures. ఈ మేరకు కేంద్ర విదేశాంగ మంత్రి S. Jaishankar ను ప్రత్యేకంగా కోరినట్లు వెల్లడించారు.