.To prevent road accidents, traffic police organised free eye check-ups for motorists in Shamirpet. The camp, conducted with support from LV Prasad Eye Institute, focused on screening heavy vehicle drivers.

శామీర్‌పేటలో ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో వాహనదారులకు ఉచిత కంటి పరీక్ష శిబిరం నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించే ఉద్దేశంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో వాహనదారులకు కంటి చూపు పరీక్షలు నిర్వహించి, అవసరమైన సూచనలు ఇచ్చారు.
డీజీపీ శివధర్ రెడ్డి, మల్కాజ్‌గిరి కమిషనర్ అవినాష్ మహంతి, డీసీపీ రాహుల్ రెడ్డి, అదనపు డీసీపీ లక్ష్మీ ఆదేశాల మేరకు “అరైవ్ అలైవ్” కార్యక్రమంలో భాగంగా ఈ శిబిరం నిర్వహించారు. L V Prasad Eye Institute ఆధ్వర్యంలో ఐ టెక్నీషియన్ శ్రావణి దొంగల మైసమ్మ చౌరస్తా వద్ద కంటి పరీక్షలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏసీపీ శంకర్ రాజు మాట్లాడుతూ, ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటిస్తూ వాహనాలు నడపాలని సూచించారు. ముఖ్యంగా భారీ వాహన డ్రైవర్ల కంటి చూపు సరిగా ఉండటం రోడ్డు భద్రతకు కీలకమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీఐ శంకరయ్య, డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ రాజు, ఎస్సైలు నవీన్ రెడ్డి, సోమిరెడ్డి తదితర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
As part of the “Arrive Alive” road safety initiative, traffic officials said regular health screening, especially vision tests for drivers, can significantly reduce accident risks. Officials reiterated that strict adherence to traffic rules is essential for public safety.