Former Minister and YSRCP leader Botsa Satyanarayana suffered a brain stroke on Thursday night. He is undergoing treatment at a Hyderabad hospital and doctors said his condition is stable.

Botsa Satyanarayana అస్వస్థతకు గురయ్యారు. గురువారం రాత్రి ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటీన హైదరాబాద్‌కు తరలించారు. శుక్రవారం ఉదయం సిటీ న్యూరో ఆస్పత్రిలో చేర్పించి వైద్యులు చికిత్స ప్రారంభించారు.
ఆస్పత్రి వర్గాల సమాచారం ప్రకారం, అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి తగిన చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ప్రమాదకర పరిస్థితి ఏమీ లేదని స్పష్టం చేశారు.
బొత్స ఆరోగ్యంపై వైసీపీ ఎమ్మెల్సీలు స్పందించారు. గురువారం రాత్రి అసౌకర్యంగా అనిపించడంతో స్వయంగా వాహనంలో హైదరాబాద్‌కు వచ్చినట్లు తెలిపారు. శుక్రవారం ఉదయం ఆస్పత్రిలో చేరిన తర్వాత వైద్యులు పలు పరీక్షలు నిర్వహించారని చెప్పారు. ప్రస్తుతం ఆరోగ్యం మెరుగ్గా ఉందని పేర్కొన్నారు.
ఇదిలాఉంటే, ఆస్పత్రి నుంచి బొత్స ఫోన్లో వైసీపీ ఎమ్మెల్సీలతో మాట్లాడినట్లు సమాచారం. శాసన మండలిలో జరుగుతున్న పరిణామాలపై ఆయన ఆరాతీస్తున్నట్లు తెలిసింది. ఒకట్రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.
Meanwhile, party sources said Botsa spoke to YSRCP MLCs over phone from the hospital and enquired about the developments in the Legislative Council. Doctors are monitoring his health and he is likely to be discharged in a day or two if recovery continues.