భారత్ చేతిలో ఓటమి తర్వాత పాకిస్తాన్ జట్టులో మార్పులపై చర్చలు మొదలయ్యాయి. After a defeat against India, discussions on major changes in the Pakistan cricket team have intensified.

భారత్ చేతిలో ఓటమి తర్వాత పాకిస్తాన్ జట్టులో మార్పులపై చర్చలు మొదలయ్యాయి. After a defeat against India, discussions on major changes in the Pakistan cricket team have intensified.

భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి తర్వాత పాకిస్తాన్ క్రికెట్ జట్టులో కీలక మార్పులపై మేనేజ్‌మెంట్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. సీనియర్ ఆటగాళ్లు బాబర్ అజాం, షాహీన్ అఫ్రిదిని తదుపరి మ్యాచ్‌కు బెంచ్‌లో ఉంచే అవకాశం ఉందని పాక్ మీడియా కథనాలు చెబుతున్నాయి. వారి స్థానాల్లో సల్మాన్ మీర్జా, నసీమ్ షా, ఫఖర్ జమాన్, ఖవాజా నఫే వంటి ఆటగాళ్ల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Following the defeat against India, Pakistan team management is reportedly considering major changes. Media reports suggest senior players Babar Azam and Shaheen Afridi could be rested for the next match, with Salman Mirza, Naseem Shah, Fakhar Zaman and Khawaja Nafe being considered as replacements.

కొలంబోలో జరిగిన మ్యాచ్‌లో భారత్ పాకిస్తాన్‌పై 61 పరుగుల తేడాతో విజయం సాధించింది. బౌలర్లు భారత్‌ను 175/7కి పరిమితం చేసినప్పటికీ పాక్ బ్యాటర్లు ఒత్తిడికి తలొగ్గారు. ముఖ్య సమయంలో సీనియర్ ఆటగాళ్ల ప్రదర్శన నిరాశ కలిగించిందని మేనేజ్‌మెంట్ అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం.

India defeated Pakistan by 61 runs in Colombo. Though bowlers restricted India to 175/7, Pakistan’s batting collapsed under pressure. Management reportedly expressed concern over senior players failing in crucial moments.

ఓటమి అనంతరం పాక్ జట్టు కోచ్ మరియు అధికారులు అర్థరాత్రి వరకు సమావేశమై జట్టు మార్పులపై చర్చించారు. నమీబియాతో జరగనున్న కీలక గ్రూప్ మ్యాచ్‌కు ముందు జట్టులో మార్పులు అవసరమని తేల్చినట్లు తెలుస్తోంది. షాహీన్ స్థానంలో సల్మాన్ మీర్జా లేదా నసీమ్ షా, బాబర్ స్థానంలో ఫఖర్ జమాన్‌ను తీసుకునే అవకాశముందని సమాచారం.

After the defeat, Pakistan team officials held late-night meetings to review the performance. Ahead of the crucial group match against Namibia, changes are likely, with Salman Mirza or Naseem Shah replacing Shaheen and Fakhar Zaman possibly coming in for Babar.

ఈ పరాజయం పై పాకిస్తాన్ మాజీ ఆటగాళ్లు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. కీలక మ్యాచ్‌లలో స్థిరమైన ప్రదర్శన అవసరమని అభిప్రాయం వ్యక్తమైంది. నమీబియాతో మ్యాచ్ పాకిస్తాన్‌కు కీలకంగా మారింది.

Former Pakistan cricketers also expressed disappointment over the loss and stressed the need for consistent performances in big matches. The upcoming game against Namibia is now crucial for Pakistan’s campaign.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *