దావోస్‌లో జరిగిన కీలక ద్వైపాక్షిక భేటీలో, ముఖ్యమంత్రి ఇజ్రాయెల్ ఆర్థిక నేతలతో సమావేశమై ఆధునిక సాంకేతికత, రక్షణ, ఇన్నోవేషన్ రంగాల్లో భాగస్వామ్య అవకాశాలపై చర్చించారు.A key bilateral engagement

Image

దావోస్‌లో జరిగిన కీలక ద్వైపాక్షిక భేటీలో, ముఖ్యమంత్రి ఇజ్రాయెల్ ఆర్థిక నేతలతో సమావేశమై ఆధునిక సాంకేతికత, రక్షణ, ఇన్నోవేషన్ రంగాల్లో భాగస్వామ్య అవకాశాలపై చర్చించారు.

దావోస్ వేదికగా N. Chandrababu Naidu, ఇజ్రాయెల్ ఆర్థిక మరియు పరిశ్రమల మంత్రి Nir Barkat, ట్రేడ్ కమిషనర్ Roey Fisher, అలాగే స్విట్జర్లాండ్‌లోని ఇజ్రాయెల్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ మిషన్ అధిపతి Shir Slutzkyతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సహకారాన్ని మరింత విస్తరించే అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది.

రక్షణ, ఏరోస్పేస్, యూఏవీ (డ్రోన్) ఎకోసిస్టమ్స్ రంగాల్లో భాగస్వామ్య అవకాశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. అలాగే నీటి వనరుల నిర్వహణలో ఇజ్రాయెల్‌కు ఉన్న నైపుణ్యాన్ని ఉపయోగించుకుంటూ డీసాలినేషన్, భూగర్భ జలాల నాణ్యత మెరుగుదల వంటి అంశాలపై సహకారం సాధ్యాసాధ్యాలను పరిశీలించారు.

సెమీకండక్టర్లు, క్వాంటమ్ టెక్నాలజీలో గ్లోబల్ లీడర్‌షిప్ సాధించే దిశగా సంయుక్త కార్యక్రమాలు, పరిశోధన, పెట్టుబడులపై చర్చలు జరిగాయి. వైద్యం, విద్య, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో ఇన్నోవేషన్ ఆధారిత భాగస్వామ్యాలు ఏర్పాటు చేసుకునే అవకాశాలను కూడా ఇరు పక్షాలు పరిశీలించాయి.

ఈ సమావేశం ద్వారా రాష్ట్రానికి ఆధునిక సాంకేతికత, నైపుణ్యం, పెట్టుబడులు ఆకర్షించే దిశగా కీలక ముందడుగు పడిందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. గ్లోబల్ భాగస్వామ్యాలతో ఆర్థిక వృద్ధి, పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని వెల్లడించారు.
A key bilateral engagement at Davos, the Chief Minister met Israel’s economic leadership to explore strategic partnerships across defence, technology, and innovation-driven sectors.

During his visit to Davos, N. Chandrababu Naidu met Nir Barkat, Israel’s Minister of Economy and Industry, along with Roey Fisher, Trade Commissioner, and Shir Slutzky, Head of the Israel Economic and Trade Mission to Switzerland. The meeting focused on strengthening cooperation between the two sides in several high-impact and future-ready sectors.

Discussions centred on partnership opportunities in defence, aerospace, and UAV ecosystems, with emphasis on advanced manufacturing, research collaboration, and technology transfer. Water management emerged as another key area, with both sides exploring cooperation in desalination technologies and groundwater quality improvement.

The talks also covered collaboration in semiconductors and quantum technologies, aimed at building leadership in next-generation computing and electronics. In addition, opportunities in medicine, education, and cybersecurity were discussed, with a focus on innovation-led growth, skill development, and knowledge exchange.

The meeting highlighted the potential for long-term strategic collaboration, leveraging Israel’s technological expertise and India’s expanding industrial and innovation ecosystem. Officials said such partnerships could play a significant role in driving investment, research, and high-value job creation.

The engagement at Davos reflects continued efforts to deepen international cooperation and position the state as a preferred destination for advanced technology partnerships and global investments.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *