English News Headline
Annadanam Held at Sri Renuka Yellamma Temple in

Full Telugu News Article
శామీర్‌పేట, అక్టోబర్ 6: శామీర్‌పేట మండల కేంద్రంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయం వద్ద మంగళవారం అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు అన్నదానం చేపట్టారు.
గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అన్నదాన కార్యక్రమానికి పలువురు దాతలు బియ్యం, కూరగాయలు, ఇతర సామగ్రిని అందించి సహకరించారు.
శామీర్‌పేటకు చెందిన గడియారం మురళీధర్ శర్మ కుటుంబ సభ్యులు 50 కిలోల బియ్యం, కూరగాయలు అందించారు. అలియాబాద్‌కు చెందిన గుత్తికొండ సాయి కృష్ణ 25 కిలోల బియ్యం, కేశవరం చెందిన కంచిగట్ల పోషయ్య (జగన్) 25 కిలోల బియ్యం అందించారు.
శామీర్‌పేటకు చెందిన బండి బాలరాజ్ గౌడ్–మహేశ్వరి దంపతులు, వారి కుటుంబ సభ్యులు కూడా అన్నదాన కార్యక్రమానికి సహకరించారు.
ఆలయానికి విచ్చేసిన భక్తులతో పాటు మాజీ ప్రజా ప్రతినిధులు, రాజీవ్ రహదారి మీదుగా వెళ్లే భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. దాతల సహకారంతో కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.
Full English News Article
Shamirpet, October 6: An Annadanam programme was held at Sri Renuka Yellamma Temple in Shamirpet on Tuesday. Special prayers were offered to the deity before food was distributed to devotees.
The Annadanam was organised under the aegis of the Goud community. Several donors supported the programme by contributing rice, vegetables and other requirements.
Gadiyaram Muralidhar Sharma and his family from Shamirpet contributed 50 kg of rice and vegetables. Guttikonda Sai Krishna from Aliabad donated 25 kg of rice, while Kanchigatla Poshayya (Jagan) from Keshavaram contributed another 25 kg of rice.
Bandi Balraj Goud and Maheshwari couple from Shamirpet, along with their family members, also extended support to the Annadanam.
Devotees visiting the temple, former public representatives and devotees travelling along Rajiv Highway received the Annadanam. The programme was conducted with the support of the donors.