రైతన్నకు మీ పాలన శాపం.. రాష్ట్రానికి పాపం: సీఎం రేవంత్‌పై హరీశ్ రావు విమర్శలు…

Harish Rao Criticises Revanth Reddy Government Over Farmers’ Plight in Telangana

తెలంగాణలో రైతుల పరిస్థితిపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. మొన్నటివరకు పచ్చగా కళకళలాడిన పంట పొలాలు నేడు ఎండిపోతున్నాయని, రైతుల కష్టాలకు రేవంత్ రెడ్డి పాలనే కారణమంటూ సామాజిక మాధ్యమ వేదికగా విమర్శించారు.

“రేవంత్.. మీ పాలన రైతన్నకు శాపం.. రాష్ట్రానికి పాపం!” అంటూ హరీశ్ రావు తన పోస్టులో పేర్కొన్నారు. పంటలు ఎండిపోతుండటంతో అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారని వ్యాఖ్యానిస్తూ #CongressFailedTelangana హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశారు.

BRS leader Harish Rao has criticised the Congress government in Telangana over the difficulties faced by farmers, targeting Chief Minister A. Revanth Reddy in a social media post.

“Your rule is a curse for farmers and a sin against the state,” Harish Rao said, alleging that agricultural fields that were until recently lush and green were now drying up, causing distress among farmers. He shared the post with the hashtag #CongressFailedTelangana.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *