PM Modi Meets Meloni in Rome
రోమ్‌లో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. భారత్-ఇటలీ సంబంధాల బలోపేతంపై ఇరు దేశాల నేతలు చర్చలు జరపనున్నారు.
Prime Minister Narendra Modi met Italian Prime Minister Giorgia Meloni in Rome ahead of key bilateral talks focused on strengthening India-Italy relations.
ఇటలీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం రోమ్ చేరుకున్నారు. అక్కడ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో సమావేశమయ్యారు. ముందుగా ఇద్దరు నేతలు విందులో పాల్గొనగా, అనంతరం ప్రపంచ ప్రఖ్యాత చారిత్రక కట్టడం కొలొస్సియంను సందర్శించారు.
ఈ సందర్భంగా భారత్-ఇటలీ మధ్య వాణిజ్యం, రక్షణ, సాంకేతికత, పెట్టుబడులు, కనెక్టివిటీ వంటి పలు అంశాలపై ఇరు దేశాల నేతలు అభిప్రాయాలు పంచుకున్నట్లు సమాచారం. భారత్-మధ్యప్రాచ్యం-యూరప్ ఎకనామిక్ కారిడార్ (IMEC) ప్రాజెక్టుపై కూడా చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు దౌత్య వర్గాలు తెలిపాయి.
భారత్ మరియు ఇటలీ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై అధికారిక చర్చలు కొనసాగనున్నాయి. ఈ పర్యటన యూరప్ దేశాలతో భారత్ సంబంధాల విస్తరణలో కీలకంగా భావిస్తున్నారు.
Prime Minister Narendra Modi arrived in Rome on Wednesday as part of his foreign tour and held a meeting with Italian Prime Minister Giorgia Meloni ahead of formal bilateral discussions. The two leaders first attended a dinner meeting and later visited the iconic Colosseum in Rome.
According to diplomatic sources, the leaders exchanged views on trade, defence cooperation, technology, investments, and connectivity projects between India and Italy. Discussions are also expected on the India-Middle East-Europe Economic Corridor (IMEC), which has emerged as a major strategic initiative.
Official talks between the two countries are expected to focus on strengthening long-term strategic cooperation and expanding economic ties. The visit is being seen as an important step in India’s growing engagement with European nations.