మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ త్వరలో భారత మార్కెట్లో లాంచ్ కానుండగా, 7000mAh బ్యాటరీ, 50MP సోనీ OIS కెమెరా వంటి ఫీచర్లతో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Motorola Edge 70 Fusion is set to launch in India soon, featuring a 7000mAh battery, 50MP Sony OIS camera and premium display specifications.

మోటోరోలా అభిమానులకు మరో కొత్త స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి రానుంది. మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్‌ను భారత మార్కెట్లో అధికారికంగా లాంచ్ చేయడానికి కంపెనీ సిద్ధమవుతోంది. సోషల్ మీడియా వేదికగా టీజర్ విడుదల చేయగా, ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేక మైక్రో వెబ్‌సైట్ కూడా ప్రారంభమైంది.

లాంచ్ వివరాలు
నివేదికల ప్రకారం ఈ వారం లేదా మార్చి మొదటి వారంలో ఫోన్ అమ్మకానికి వచ్చే అవకాశం ఉంది. అయితే ఖచ్చితమైన లాంచ్ తేదీని కంపెనీ ఇంకా ప్రకటించలేదు.

ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.78 అంగుళాల క్వాడ్-కర్వ్డ్ OLED డిస్‌ప్లే, 1.5K రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్ అందుబాటులో ఉంటాయి. గరిష్టంగా 5,200 నిట్స్ బ్రైట్‌నెస్ సపోర్ట్ చేస్తుందని కంపెనీ తెలిపింది. 7,000mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీతో పాటు 68W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది.

కెమెరా విభాగంలో 50MP సోనీ LYT-710 సెన్సార్ OIS సపోర్ట్‌తో రానుంది. అదనంగా 13MP అల్ట్రా-వైడ్ లెన్స్ (మాక్రో సపోర్ట్) ఉండొచ్చని సమాచారం. ముందుభాగంలో 32MP సెల్ఫీ కెమెరా ఇవ్వవచ్చు.

పనితీరు పరంగా క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7s Gen 4 చిప్‌సెట్, 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ ఆప్షన్ ఉండవచ్చని అంచనా. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 రక్షణ కూడా లభించే అవకాశం ఉంది.

ధర (అంచనా)
8GB + 256GB వేరియంట్ ధర సుమారు రూ.30,000 వద్ద ఉండవచ్చని మార్కెట్ అంచనా. అధికారిక ధర వివరాలు లాంచ్ సందర్భంగా వెల్లడయ్యే అవకాశం ఉంది.

Motorola is preparing to launch the Edge 70 Fusion in India with high-end specifications. The smartphone is expected to feature a 6.78-inch 1.5K quad-curved OLED display with 144Hz refresh rate and up to 5,200 nits brightness. It may be powered by a Snapdragon 7s Gen 4 processor with 8GB RAM and 256GB storage.

The device is likely to pack a massive 7,000mAh battery with 68W fast charging support. In the camera department, a 50MP Sony LYT-710 sensor with OIS, a 13MP ultra-wide lens, and a 32MP front camera are expected. The estimated starting price could be around ₹30,000.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *