Malkajgiri Police Drug Awareness Drive in Uppal

మల్కాజిగిరి పోలీసుల ఆధ్వర్యంలో ఉప్పల్ జోన్‌లోని గణేష్ మండపాల వద్ద డ్రగ్స్‌కు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గణేష్ సురక్షా సంకల్ప్–2026లో భాగంగా భక్తులకు మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించి, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని సూచించారు.
మల్కాజిగిరి పోలీసులు, EAGLE Telangana, SAHACHARI సంస్థల సహకారంతో ఉప్పల్ జోన్ పరిధిలోని గణేష్ మండపాల వద్ద డ్రగ్-ఫ్రీ సొసైటీ సందేశాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. గణేష్ సురక్షా సంకల్ప్–2026లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో భక్తులకు మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే హానికర ప్రభావాలను వివరించారు.
డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ ఐక్యంగా నిలవాలని, సురక్షితమైన, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి సహకరించాలని పోలీసులు సూచించారు. అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్లను అందజేశారు.
Malkajgiri Police Spread Drug-Free Society Message Across Uppal Ganesh Mandaps
Malkajgiri Police, in collaboration with EAGLE Telangana and SAHACHARI, conducted a drug-awareness drive at Ganesh mandaps across the Uppal Zone as part of Ganesh Suraksha Sankalp–2026.
Devotees were sensitised to the harmful effects of drug abuse and urged to stand together against drugs and contribute to building a safe and healthy community.
Certificates were presented to participants who took part in the awareness drive, reinforcing the campaign’s message of promoting a drug-free society.