English News Headline
Mobile Recharge Prices Set to Rise as Airtel and Vodafone Idea Increase Tariffs
Full Telugu News Article

దేశంలో మొబైల్ వినియోగదారులకు మరోసారి అదనపు భారం పడే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే ఎయిర్‌టెల్ రీఛార్జ్ ధరలను పెంచగా, ఇప్పుడు వొడాఫోన్ ఐడియా కూడా అదే దారిలో నడవబోతోందని స్పష్టం చేసింది.
మొబైల్ రీఛార్జ్ టారిఫ్ ధరలను పెంచనున్నట్లు వొడాఫోన్ ఐడియా అధికారికంగా ప్రకటించింది. అయితే ఎంత శాతం పెంపు ఉంటుంది, ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనే వివరాలను మాత్రం ఇంకా వెల్లడించలేదు. ధరల పెంపు నామమాత్రంగానే ఉంటుందని సంస్థ తెలిపింది.
ఇటీవల ఎయిర్‌టెల్ తన టారిఫ్ ప్లాన్లను 4 నుంచి 5 శాతం వరకు పెంచింది. ముఖ్యంగా 84 రోజుల వ్యాలిడిటీ గల ప్రజాదరణ పొందిన ప్లాన్ ధర రూ.859 నుంచి రూ.899కు చేరుకుంది. దీంతో వినియోగదారులపై అదనంగా రూ.50 భారం పడింది.
ఇప్పుడు వొడాఫోన్ ఐడియా కూడా అదే స్థాయిలో ధరలు పెంచే అవకాశముందని టెలికాం రంగంలో చర్చ జరుగుతోంది. జియో, ఎయిర్‌టెల్ తర్వాత మూడో అతిపెద్ద టెలికాం సంస్థగా ఉన్న వొడాఫోన్ ఐడియా ఈ నిర్ణయం లక్షల మంది వినియోగదారులను ప్రభావితం చేయనుంది.
టెలికాం రంగ నిపుణుల అంచనా ప్రకారం ఈ ఏడాది మొత్తం రీఛార్జ్ ధరలు 15 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. దీంతో సాధారణ వినియోగదారులపై మరింత ఆర్థిక భారం పడే అవకాశం ఉంది.
వొడాఫోన్ ఐడియా సీఈఓ అభిజిత్ కిశోర్ మాట్లాడుతూ సంస్థ పనితీరుపై విశ్వాసం ఉందని, మార్చి నెలలో లక్షల సంఖ్యలో కొత్త సబ్‌స్క్రైబర్లు చేరినట్లు తెలిపారు.
Full English News Article
Mobile phone users across India may soon face another financial burden as telecom companies move towards increasing recharge prices. After Airtel raised its tariffs, Vodafone Idea has also confirmed that it plans to revise its mobile recharge prices.
Vodafone Idea officially stated that it will increase mobile recharge tariff prices, although the company has not yet announced the exact percentage of the hike or the date of implementation. It clarified that the increase will be nominal.
Recently, Bharti Airtel increased its tariff plans by around 4 to 5 percent. One of its popular 84-day validity recharge plans moved from Rs 859 to Rs 899, placing an additional burden of Rs 50 on users.
Now, Vodafone Idea is also expected to follow a similar pricing strategy. As the third-largest telecom network after Jio and Airtel, this move is likely to affect lakhs of mobile users across the country.
Telecom sector experts believe that overall recharge prices may rise by nearly 15 percent this year. This could create a significant financial impact on common users who depend heavily on mobile data and calling services.
Vodafone Idea CEO Abhijit Kishore said the company remains confident about its business performance and added that lakhs of new subscribers joined the network during March.