బంగారం ధరలు మళ్లీ తగ్గాయి

English News Headline

Gold Price Today: Gold Rates Fall Again in Hyderabad, Buyers Get Relief


Full Telugu News Article

పసిడి కొనుగోలుదారులకు మరోసారి ఊరట లభించింది. గత కొన్ని రోజులుగా వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలకు బ్రేక్ పడింది. వరుసగా రెండో రోజు బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టడంతో కొనుగోలు దారులు స్వల్ప ఉపశమనం పొందుతున్నారు.

పశ్చిమాసియా ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్‌లో అనిశ్చితి కారణంగా గత కొద్ది రోజులుగా బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ఒక దశలో బంగారం ధరలు ఆల్‌టైమ్ హై స్థాయికి చేరి రూ.2 లక్షలకు చేరువయ్యాయి.

అయితే తాజాగా అంతర్జాతీయ పరిస్థితుల్లో మార్పులు రావడంతో బంగారం ధరలు తగ్గడం ప్రారంభమైంది. గురువారంతో పోల్చితే శుక్రవారం ఉదయం 10 గంటల నాటికి జాతీయ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.600 వరకు తగ్గుదల నమోదైంది.

హైదరాబాద్‌లో ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్చమైన బంగారం ధర రూ.1,52,950 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,40,200 వద్ద ఉంది. నిన్నటితో పోల్చితే 24 క్యారెట్ల బంగారంపై రూ.600, 22 క్యారెట్ల బంగారంపై రూ.550 తగ్గింది.

విజయవాడలో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం రూ.1,53,100 కాగా, 22 క్యారెట్ల ధర రూ.1,40,350గా ఉంది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం రూ.1,53,820, 22 క్యారెట్ల ధర రూ.1,41,000గా నమోదైంది.

వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.2,59,900 వద్ద ఉండగా, హైదరాబాద్, చెన్నై, కేరళలో కిలో వెండి ధర రూ.2,65,000 వద్ద ట్రేడవుతోంది.

బంగారం ధరలు తగ్గడంతో పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశం అని వ్యాపారులు చెబుతున్నారు.


Full English News Article

Gold buyers have received some relief as gold and silver prices declined for the second consecutive day after several days of sharp increases in the domestic market.

Due to West Asia tensions and global market uncertainty, gold and silver prices had surged significantly over the past few days. At one stage, gold prices moved close to the all-time high mark of Rs 2 lakh.

However, with recent changes in international market conditions, gold prices have started declining again. Compared to Thursday, the price of 24-carat gold fell by nearly Rs 600 per 10 grams in the national market by Friday morning.

In Hyderabad, the price of 24-carat pure gold is currently at Rs 1,52,950 for 10 grams, while 22-carat gold is priced at Rs 1,40,200 for 10 grams. Compared to the previous day, 24-carat gold dropped by Rs 600 and 22-carat gold by Rs 550.

The same prices are being seen in Vijayawada and Mumbai. In Delhi, 24-carat gold is priced at Rs 1,53,100 and 22-carat gold at Rs 1,40,350.

In Chennai, 24-carat gold is trading at Rs 1,53,820 while 22-carat gold stands at Rs 1,41,000. Bengaluru, Kolkata, and Kerala are also witnessing similar pricing trends.

Silver prices also declined slightly. The domestic market price for one kilogram of silver is now around Rs 2,59,900, while in Hyderabad, Chennai, and Kerala it is trading at Rs 2,65,000 per kilogram.

Jewellery traders say the fall in gold prices is a good opportunity for buyers planning purchases for weddings and family functions.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *