English News Headline
Telangana CM Revanth Reddy Orders Expansion of Prajavani Services to Mandal Level

Full Telugu News Article
తెలంగాణలో ప్రజల అర్జీలు, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మరింత పకడ్బందీగా అమలు చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజావాణి సేవలను క్షేత్రస్థాయికి విస్తరించి ప్రజలకు మరింత చేరువ చేయాలని సూచించారు.
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుసటి రోజే, 2023 డిసెంబర్ 8న ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ప్రతి మంగళవారం, శుక్రవారం మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో ప్రజావాణి విజయవంతంగా కొనసాగుతోంది.
ప్రస్తుతం ప్రజలు ఇచ్చే అర్జీలు, దరఖాస్తులను అన్ని శాఖల అధికారులు అక్కడికక్కడే స్వీకరించి వేగంగా పరిష్కరించే చర్యలు చేపడుతున్నారు. జిల్లా స్థాయిలో కూడా కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రతి వారం ప్రజావాణి నిర్వహిస్తున్నారు.
దూర ప్రాంతాల ప్రజలు హైదరాబాద్‌కు లేదా జిల్లా కేంద్రాలకు రావాల్సిన అవసరం తగ్గించేందుకు వెంటనే రెవెన్యూ డివిజన్ స్థాయిలో ప్రజావాణి ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. తరువాత దశలో మండల స్థాయికి కూడా ఈ సేవలను విస్తరించాలని సూచించారు.
ప్రజావాణిలో వచ్చే ప్రతి ఫిర్యాదును తప్పనిసరిగా నమోదు చేసి సంబంధిత శాఖలకు పంపాలని, పరిష్కార పురోగతిని అర్జీదారునికి తెలియజేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఫిర్యాదుల పరిష్కారానికి నిర్ణీత గడువులు ఉండాలని, ఆలస్యం జరగకుండా చూడాలని తెలిపారు.
ఫిర్యాదుల నమోదు, ట్రాకింగ్, పరిష్కారం కోసం ఏకీకృత డిజిటల్ ప్లాట్‌ఫాం అభివృద్ధి చేయాలని సీఎం ఆదేశించారు. జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో రియల్ టైమ్ మానిటరింగ్ ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రతి స్థాయిలో ప్రజావాణికి ప్రత్యేక నోడల్ అధికారులను నియమించాలని, ప్రతి శాఖలో ప్రత్యేక ప్రజావాణి విభాగాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఒకస్థాయిలో పరిష్కారం కాకపోతే పైస్థాయి అధికారికి ఆటో ఎస్కలేషన్ ద్వారా అర్జీ చేరే విధానం అమలు చేయాలని సూచించారు.
పెండింగ్ ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, డ్యాష్‌బోర్డ్ ద్వారా పరిష్కార పురోగతిని పర్యవేక్షించాలని సీఎం తెలిపారు. ఎక్కడైనా ఆలస్యం జరిగితే సంబంధిత అధికారులను బాధ్యులుగా చేయాలని స్పష్టం చేశారు.
ప్రజావాణి సేవలను వికేంద్రీకరించడం ద్వారా జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో పెండింగ్ అర్జీలు తగ్గడంతో పాటు కింది స్థాయిలోనే సమస్యల పరిష్కారం సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రజలకు నమ్మకంగా ఉండేలా ప్రజావాణి సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.
Full English News Article
Chief Minister A. Revanth Reddy has directed officials to strengthen the public grievance redressal system in Telangana and expand Prajavani services to the grassroots level for faster resolution of public complaints.
The Prajavani program was launched on December 8, 2023, the day after the new government assumed office. Since then, it has been conducted successfully every Tuesday and Friday at Mahatma Jyotiba Phule Praja Bhavan in Hyderabad.
Officials from all departments currently receive petitions and applications directly from citizens and initiate speedy resolution of grievances. Similar Prajavani programs are also being conducted every week at the district level under the supervision of district collectors.
To reduce the burden on people travelling from remote areas to Hyderabad or district headquarters, the Chief Minister ordered the immediate launch of Prajavani at the Revenue Division level. In the next phase, the service will be extended to the mandal level as well.
He instructed officials to register every complaint without fail, forward it to the concerned department, and keep applicants informed about the progress of resolution. Fixed timelines must be followed to ensure there is no delay in addressing complaints.
The CM also directed the development of an integrated digital platform for complaint registration, tracking, and resolution. Real-time monitoring should be available at both district and state levels for better governance.
Special nodal officers must be appointed for Prajavani at every level, and dedicated grievance cells should be established in every department and district. If an issue is not resolved at one level, it should automatically escalate to higher officials.
Revanth Reddy stressed that there should be no compromise in grievance resolution. Pending complaints must be reviewed regularly, and dashboard-based monitoring should ensure accountability. Officials responsible for delays must be held answerable.
The Chief Minister said decentralising Prajavani services will reduce pending applications at district and state levels and help resolve many issues at the lower administrative level itself, making governance more accessible and trustworthy for the public.